National Film Awards: 70వ నేషనల్ సినీ అవార్డ్స్.. ఎవరెవరికి అవార్డులు వచ్చాయంటే?
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. విజేతలకు అవార్డులని ప్రకటించారు. ఈ వేడుకకు దాదాపు అన్ని సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు.
తెలుగు నుంచి 'కార్తికేయ 2'కి ఉత్తమ ప్రాంతీయ చిత్ర కేటగిరీలో పురస్కారం దక్కింది. దర్శకుడు చందు మొండేటి దీన్ని అందుకున్నారు. 'తిరు' చిత్రానికి ఉత్తమ నటిగా నిత్యా మీనన్, 'కాంతార' మూవీకి గానూ ఉత్తమ నటుడిగా రిషభ్ శెట్టి అవార్డులు అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రదానం చేశారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి అవార్డ్ ఇవ్వాలి. కానీ లైంగిక ఆరోపణల కేసు కారణంగా దీన్ని రద్దు చేశారు.
ఎవరెవరికి ఏ విభాగాల్లో అవార్డులు?
ఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం)
ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార)
ఉత్తమ నటి: నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా : బ్రహ్మాస్త్ర - పార్ట్ 1
ఉత్తమ దర్శకుడు : సూరజ్ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)
బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్
ఉత్తమ సహాయ నటుడు : పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)
ఉత్తమ సహాయ నటి : నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర
ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)
Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు'
ఉత్తమ సంగీతం (పాటలు) : ప్రీతమ్ (బ్రహ్మస్త్ర -హిందీ)
ఉత్తమ సంగీతం (నేపథ్యం) : ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ - 1 తమిళం)
ఉత్తమసినిమాటోగ్రఫీ : రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 తమిళం)
ఉత్తమ సౌండ్ డిజైన్ : ఆనంద్ కృష్ణమూర్తి (పొన్నియిన్ సెల్వన్ - 1)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ : శ్రీపాథ్ (మాలికాపురం - మలయాళం)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : ఆనంద్ ఏకార్షి (ఆట్టం- మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్ : మహేష్ భువనేండ్ (ఆట్టం)
ఉత్తమ యాక్షన్ డైరక్షన్ : అన్బరివు (కేజీఎఫ్- 2)
ఉత్తమ మేకప్ : సోమనాథ్ కుందు (అపరాజితో- బెంగాళీ)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : నిక్కి జోషి (కచ్ ఎక్స్‌ప్రెస్- గుజరాతీ)
ఉత్తమ మాటల రచయిత : అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల (గుల్‌మోహర్)
ఉత్తమ ప్రాంతీయ సినిమాలు..
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కార్తికేయ -2 (తెలుగు)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కేజీఎఫ్ 2 (కన్నడ)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : గుల్‌మొహర్ (హిందీ)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)
IIFA Awards winners: మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్టు.. అలాగే ఈ హీరోలకూ..
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్ (బెంగాళీ)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ (మరాఠీ)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్ (ఒడియా)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ)
జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ సినిమాలు
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ : ఉన్యుత (వాయిడ్) - అస్సామీ
ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ : అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూ
ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ : మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ (మరాఠీ)
ఉత్తమ యానిమేషన్ సినిమా : ఏ కోకోనట్ ట్రీ (సైలెంట్)
ఉత్తమ దర్శకులు : మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్)
ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : బస్తి దినేశ్ షెనోయ్ (ఇంటర్‌మిషన్ - కన్నడ)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : విశాల్ భరద్వాజ్ (ఫుర్సత్- లీజర్/ హిందీ)
ఉత్తమ క్రిటిక్: దీపక్ దుహా (హిందీ)
ఉత్తమ బుక్ ఆన్ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్ ధార్ కిషోర్ కుమార్ (ది అల్టిమేట్ బయోగ్రఫీ - ఇంగ్లిష్)
ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్ దివాన్ -మోనో నో అవేర్ (హిందీ - ఇంగ్లీష్)
Tags
- 70th National Film Award
- national film awards
- national awards
- rishab shetty
- Nithya Menen
- President Droupadi Murmu
- Indian cinemas
- best actor
- best actress
- Best Director
- Sooraj Barjatya
- Karthikeya 2
- Sakshi Education Updates
- 70thNationalCineAwards
- NationalCineAwards2024
- VijayBhavan
- PresidentDraupathiMurmu
- IndianFilmAwards
- BestActor2024
- FilmCelebrities
- AwardWinningFilms
- BollywoodAwards
- TollywoodRecognition
- SakshiEducationUpdates