IFFI Complete Winners List: గోవాలో జరిగిన 55వ 'ఇఫీ' వేడుకలు.. అవార్డు అందుకున్న నటులు వీరే..
Sakshi Education
గోవాలో 55వ 'ఇఫీ' (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకలు అట్టహాసంగా ముగిశాయి.
నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు జరిగిన ఈ వేడుకలో ‘యంగ్ ఫిల్మ్‌మేకర్స్: ద ఫ్యూచర్ ఈజ్ నౌ’ అనే థీమ్‌ను ఆధారంగా 80 దేశాలకు చెందిన 180 సినిమాలు ప్రదర్శించబడ్డాయి. ఈ వేడుకలో ఎన్ఆర్, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ వంటి సినీ దిగ్గజాల శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి.
ఈ ఉత్సవం 9 రోజులపాటు కొనసాగింది. ఇందులో దేశ, విదేశీ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చివరి రోజు విజేతలకు అవార్డులు ప్రదానం చేయగా, వేడుకను ఆటాపాటలతో ముగించారు.
అవార్డు అందుకున్నది వీరే..
- 'హోలీ కౌ' చిత్రంలోని నటనకు గాను క్లెమెంట్ ఫేబో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.
- ‘ది గోల్డెన్ పీకాక్’ అవార్డు లిథువేనియాకి చెందిన ‘టాక్సిక్’ సినిమాకు దక్కింది. ఈ చిత్రానికి వెస్ట్, లెవా ఉత్తమ నటీమణులుగా అవార్డులు పొందారు.
- ‘ది న్యూ ఇయర్ దట్ నెవర్ కమ్’ చిత్రానికి రొమేనియా దర్శకుడు బోగ్డాన్ మురేసా ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు.
- ‘హూ డు ఐ బిలాంగ్ టూ’ చిత్రానికి ఫ్రెంచ్-ట్యూనిషియా నటుడు ఆడమ్ బెస్సా ఉత్తమ నటుడిగా (స్పెషల్ మెన్షన్) అవార్డు అందుకున్నారు.
- ‘బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నవజ్యోత్ బండివాడేకర్ (గుజరాతీ చిత్రం ‘ఘారత్ గణపతి’) అవార్డు గెలుచుకున్నారు.
Forbes List: ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న అల్లు అర్జున్.. టాప్-10లో ఉన్న నటులు వీరే..
- ‘బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్’గా అమెరికన్ ఫిల్మ్ మేకర్ సారా ఫ్రైడ్‌ల్యాండ్ (ద ఫెమిలియర్ టచ్)కు అవార్డు.
- లూయిస్ కోర్వోసియర్స్ (హోలీ కౌ చిత్రానికి) స్పెషల్ జ్యూరీ అవార్డు పొందారు.
- సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారం ఆస్ట్రేలియా దర్శకుడు ఫిలిప్ నోయిస్‌కు దక్కింది. ఈ సందర్భంగా తాను ఓ ఇండియన్ ఫిల్మ్‌ను చేయబోతున్నానని కూడా ఫిలిప్ పేర్కొన్నారు.
- ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ – 2024’ పురస్కారం విక్రాంత్ మాస్సేకు ఇచ్చారు. మరాఠీ వెబ్ సిరీస్ ‘లంపన్’ బెస్ట్ సిరీస్ అవార్డును పొందింది.
- ‘క్రాసింగ్’ చిత్రానికి యూనెస్కో గాంధీ మెడల్–2024 పురస్కారం దక్కింది.
ANR National Awards 2024: ANR అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
Published date : 29 Nov 2024 06:27PM