Skip to main content

National Water Awards: ఆంధ్రప్రదేశ్‌కు ఐదు జ‌ల‌శక్తి అవార్డులు

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఐదో జాతీయ జల పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ ఐదు జ‌ల‌శక్తి అవార్డులను కైవసం చేసుకుంది.
Andhra Pradesh Received Five National Water Awards  Celebration of Andhra Pradeshs five Jal Shakti Awards

2023 సంవత్సరానికి ఏపీకి ఐదు జ‌ల‌శక్తి అవార్డులు ల‌భించాయి. ఈ అవార్డులను అక్టోబ‌ర్ 22వ తేదీ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధికారులకు అందచేశారు. 

ఏటా ఉత్తమ జిల్లా, ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ పట్టణ స్థానిక సంస్థ, ఉత్తమ పాఠశాల/కాలేజీ, ఉత్తమ పరిశ్రమ, ఉత్తమ నీటివినియోగదారుల సంఘం, ఉత్తమ పౌరసమాజం వంటి వివిధ విభాగాలలో కేంద్రం అవార్డులను ప్రకటిస్తుంది. జలశక్తిశాఖ ప్రకటించిన ఈ అవార్డుల్లో 2023 సంవత్సరానికి రాష్ట్రం ఐదు జాతీయ అవార్డులను సాధించింది.

➤ విశాఖపట్నం జిల్లా నీటిసంరక్షణలో ప్రతిభ చూపినందుకు దక్షిణాదిలో ఉత్తమ జిల్లా ర్యాం కును కైవసం చేసుకుంది. ఈ అవార్డును విశాఖ కలెక్టర్ హరేందిరప్రసాద్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ టీవీఎన్ఆర్ కుమార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అందుకున్నారు. 

World Record: గిన్నిస్‌ రికార్డు.. ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్‌ను రూపొందించిన భారతీయుడు..!

➤ 78 నీటిసంరక్షణ నిర్మాణాలతో పాటు, కొండ ప్రాంతాల్లో ట్రెంచ్‌లు, మినీ సర్క్యులేషన్ ట్యాంకులు, పంటకుంటలు, చేపల చెరువులు, ఇంకుడు గుంతలు, ట్రెంచ్ల తవ్వకం, చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టినందుకుగాను అనంతపురం జిల్లాలోని హంపాపురం ఉత్తమ పంచాయతీగా కేంద్రంగా ఎంపికైంది.

➤ వాననీటి సంరక్షణ విభాగంలో గుంటూరుకు చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ అవార్డు కైవసం చేసుకుంది. 

➤ విశాఖలోని శ్రీతిరుమల నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ - అసోసియేషన్ తమ కాలనీలో 100 రూఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టి 16 లక్షల లీటర్ల నీటిని ఆదా చేసింది.

➤ తిరుపతి ఐఐటీ ఈ పోటీలో స్పెషల్ మెన్షన్ గెల్చుకుంది. వాననీటిని వందశాతం సేకరించే విధంగా 8.87 కోట్ల లీటర్ల సామర్థ్యంతో రెండు చెరువులు నిర్మించినందుకు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కేఎన్ స‌త్యనారాయణ అందుకున్నారు.

Mithun Chakraborty: మిథున్‌ చక్రవర్తికి 'దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు'

Published date : 23 Oct 2024 03:08PM

Photo Stories