Skip to main content

BC and OBC Scholarships 2023: బీసీ, ఈబీసీ సంచార జాతుల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

సాక్షి ఎడ్యుకేష‌న్ : జిల్లాలో బీసీ, ఈబీసీ సంచార జాతుల విద్యార్థులకు పీఎం యశస్వి (పీఎం యంగ్‌ అచివ్‌మెంట్‌ స్కాలర్‌షిప్‌ అవార్డ్‌ స్కీమ్‌ ఫర్‌ వైబ్ర ంట్‌ ఇండియా) ఉపకార వేతనాలు అందిస్తున్నట్టు జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ సాధికారిత అధికారి కె.రాజెశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు.
BC and OBC Scholarships 2023

తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఏడాదికి రూ.2.50 లక్షల లోపు ఉండి, 9వ తరగతి, ఇంటర్మీడియెట్‌ ప్రధమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వైఈటీ.ఎన్‌టీఏ.ఏసీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో ఆగస్టు 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఉపకార వేతనాలు పొందేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ 29న జరిగే ప్రవేశ పరీక్షలో విద్యార్థుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారన్నారు.

Telangana : గుడ్‌న్యూస్.. ఈ విద్యార్హతల ఆధారంగా 20,555 మందికి పోస్టింగ్‌లు ఇలా..

ఈ పథకంలో ఎంపికై న 9వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రూ.75 వేలు, ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు రూ.1.25 లక్షల వరకు కళాశాల, హాస్టల్‌ ఫీజులకు విడుదల చేస్తారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ కార్డు బ్యాంక్‌ పాసుపుస్తకానికి లింకై ఉండాలని పేర్కొన్నారు. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. స్కీమ్‌ పూర్తి వివరాలకు సోషల్‌ జస్టిస్‌.గవ్‌.ఇన్‌/స్కీమ్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.
 

Events important dates
Mon, 06/14/2021 - 15:19

Photo Stories