Skip to main content

Single Girl Child Scholarship 2023: సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌–2023.. ఎవరు అర్హులంటే..

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ).. తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం ఉపకార వేతనాన్ని అందిస్తోంది. దీనికి సంబంధించి 2023 ప్రకటన వెలువడింది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
CBSE Single Girl Child Scholarship 2023,CBSE Merit Scholarship 2023,CBSE 2023 Scholarship Announcement

అర్హత: విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. విద్యార్థిని సీబీఎస్‌ఈలో పదో తరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలో పదకొండో తరగతి, పన్నెండో తరగతి చదువుతూ ఉండాలి. పదో తరగతి పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థిని ట్యూషన్‌ ఫీజు నెలకు రూ.1500 కంటే మించకూడదు.

స్కాలర్‌షిప్‌: స్కాలర్‌షిప్‌కి ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్‌ చేయించుకోవాలంటే.. విద్యార్థిని కనీసం 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.500 చొప్పున అందిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:18.10.2023
సీబీఎస్‌ఈ పాఠశాలల దరఖాస్తు ధ్రువీకరణ తేదీ­లు: 25.09.2023 నుంచి 25.10.2023 వరకు

వెబ్‌సైట్‌: https://www.cbse.gov.in/

చదవండి: 3115 Railway Jobs: ఈస్ట్రన్‌ రైల్వేలో యాక్ట్‌ అప్రెంటిస్‌లు ఖాళీ‌లు .. పూర్తి వివరాలు ఇవే..

Last Date

Photo Stories