Skip to main content

Admissions in IIST: ఐఐఎస్‌టీ, తిరువనంతపురంలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూ­ట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ).. జనవరి–2024 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Admissions Open for PHD at Indian Institute of Space Science and Technology, Academic Year January 2024 PHD Course, Admissions in IIST Thiruvananthapuram, IIST Thiruvananthapuram PHD Application Details,

కోర్సు వివరాలు
విభాగాలు: ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ స్పేస్‌ సైన్సెస్, హ్యుమానిటీస్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్‌.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌/టెక్నాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ లేదా కనీసం 75శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌/టెక్నాలజీ) ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్‌ గేట్‌ స్కోరు సాధించి ఉండాలి. లేదా సంబంధిత వి­భాగంలో ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు యూజీసీ–సీఎస్‌ఐఆర్‌ నెట్‌–జేఆర్‌ఎఫ్‌ /లెక్చర్‌షిప్, ఎన్‌బీహెచ్‌ఎం/జెస్ట్‌/గేట్‌ స్కోరు సాధించి ఉండాలి.
వయసు: 31.10.2023 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.10.2023
పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 08.11.2023.
ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ పరీక్ష తేది: 16.11.2023.
పరీక్ష ఫలితాల వెల్లడి తేది: 22.11.2023.

వెబ్‌సైట్‌: https://www.iist.ac.in/

చ‌ద‌వండి: Admissions in CSL: సీఎస్‌ఎల్, కొచ్చిలో గ్రాడ్యుయేట్‌ మెరైన్‌ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు

Last Date

Photo Stories