PhD Admissions in NIMHANS: నిమ్‌హాన్స్, బెంగళూరులో పీహెచ్‌డీలో ప్రవేశాలు
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్.. 2022–23 విదా సంవత్సరంలో సెషన్ 2 కింద వివిధ కోర్సుల్లో పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: బయోఫిజిక్స్, బయోస్టాటిస్టిక్స్, చైల్డ్–అడోల్‌సెంట్ సైకియాట్రీ, క్లినికల్ సైకాలజీ, క్లినికల్ సైకోఫార్మకాలజీ–న్యూరోటాక్సికాలజీ, హ్యూమన్ జెనెటిక్స్, మెంటల్ హెల్త్ ఎడ్యుకేషన్, న్యూరోకెమిస్ట్రీ, న్యూరోఇమేజింగ్–ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, న్యూరాలజీ, న్యూరోలాజికల్ రిహాబిలిటేషన్ న్యూరో మైక్రోబయాలజీ, న్యూరో పాథాలజీ, న్యూరో ఫిజియాలజీ, నర్సింగ్, సైకియాట్రీ తదితరాలు.
పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కోర్సులు
విభాగాలు: ఎపిలెప్సి, మూవ్‌మెంట్ డిజార్డర్స్, న్యూరోమస్కులర్ డిజార్డర్స్.
అర్హత: బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, ఎంఫిల్, మా స్టర్స్ డిగ్రీ, ఎండీ, డీఎన్‌బీ, ఎంఈ, ఎంటెక్.
కోర్సు వ్యవధి: 3 నుంచి 5 ఏళ్లు ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డీన్–కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్, నిమ్‌హాన్స్, హోసూర్ రోడ్డు, బెంగళూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 22.10.2022
ప్రవేÔశ పరీక్ష తేది: 24.11.2022
వెబ్‌సైట్: http://www.nimhans.ac.in