IIFT: ఐఐఎఫ్‌టీలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ..
ప్రముఖ బీస్కూల్.. ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ).. పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రోగ్రామ్: ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్(ఈపీజీ డిఐబీ).
స్పెషలైజేషన్లు: ఇంటర్నేషనల్ బిజినెస్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్.
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ /పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. సంప్రదాయ డిగ్రీ చేసినవారికి కనీసం ఐదేళ్లు, ఇంజనీరింగ్ డిగ్రీ/పీజీ పూర్తిచేసిన వారికి కనీసం మూడేళ్ల మేనేజీరియల్ అనుభవం ఉండాలి. వయోపరిమితి నిబంధనలు లేవు.
ప్రోగ్రామ్ వివరాలు: కోర్సు కాలవ్యవధి 18 నెలలు. మూడో సెమిస్టర్‌లో స్పెషలైజేషన్‌కు ఎంచుకోవాల్సి ఉంటుంది. వారాంతాల్లో ఫిజికల్ క్లాసెస్ నిర్వహిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2022
- వెబ్‌సైట్: http://www.iift.ac.in/