NEET MDS 2022: దంత వైద్యంలో.. మాస్టర్స్
దంత వైద్యానికి సంబంధించి బీడీఎస్ పూర్తిచేసి.. మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే వారికోసం నీట్ ఎండీఎస్ ప్రకటన వెలువడింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బీఈఎంఎస్).. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. నీట్ ఎండీఎస్ అనేది అర్హత కమ్ ర్యాంకింగ్ పరీక్ష. దీనిలో సాధించిన స్కోర్ ఆధారంగా మాత్రమే ఆల్ ఇండియా, స్టేట్, డీమ్డ్/సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ ఎండీఎస్ 2022కు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. పరీక్షకు సంబంధించిన సమగ్ర సమాచారం...
అర్హతలు
- బ్యాచిలర్ ఇన్ డెంటల్ సర్జరీ(బీడీఎస్) ఉత్తీర్ణతతోపాటు 2022 మార్చి 31 నాటికి ఏడాది ఇంటర్న్‌షిప్/ప్రాక్టికల్ ట్రెయినింగ్ పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక విధానం
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ పరీక్షని ఎన్‌బీఈఎంఎస్ నిర్వహిస్తోంది.
పరీక్ష విధానం
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నీట్ ఎండీఎస్ నిర్వహించనున్నారు. రెండు పార్ట్‌లుగా జరిగే ఈ పరీక్షలో.. పార్ట్–ఎలో 100 ప్రశ్నలుు, పార్ట్–బిలో 140 ప్రశ్నలు ఉంటాయి. టాపిక్ వైజ్‌గా ప్రశ్నల కేటాయింపు జరుగుతుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి 4మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి–1 మార్కును కోతగా విధిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు.
సిలబస్ ఇలా..
- పార్ట్–ఎ: ఈ విభాగంలో జనరల్ అనాటమీ ఇన్‌క్లూడింగ్ ఎంబ్రియాలజీ అండ్ హిస్టాలజీ, జనరల్ హ్యూమన్ ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ, డెంటల్ అనాటమీ, ఎంబ్రియాలజీ అండ్ ఓరల్ హిస్టాలజీ, జనరల్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ, జనరల్ అండ్ డెంటల్ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీల నుంచి ప్రశ్నలుంటాయి.
- పార్ట్–బి: ఈ విభాగంలో డెంటల్ మెటీరియల్, ఓరల్ పాథాలజీ అండ్ ఓరల్ మైక్రోబయాలజీ, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియోలజీ, పెడోడోంటిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, ఆర్థోడాంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్, పీరియాడాంటాలజీ, ప్రోస్టోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్,కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్, ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీ, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ టాపిక్స్ నుంచి ప్రశ్నలుంటాయి.
కౌన్సెలింగ్ ఇలా
- నీట్ ఎండీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ మార్చిలో ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ విధానంలో ఈ ప్రక్రియ జరగుతుంది. ఆయా కోటా సీట్లకు ఆనుగుణంగా సంబంధిత విద్యా సంస్థలు వేర్వేరు తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.
- ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన 50 శాతం సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ చూస్తోంది.
- రాష్ట్ర కోటాకు సంబంధించి సీట్లకు కౌన్సెలింగ్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అ«థారాటీలు/యూనివర్సిటీలు నిర్వహిస్తాయి.
- ప్రయివేట్ డెంటల్ కాలేజీలు/ఇన్‌స్టిట్యూట్స్/యూనివర్సిటీలు/డీమ్డ్ యూనివర్సిటీలకు సంబంధించి.. ఆయా సంస్థలు నియమించిన అథారిటీలు కౌన్సెలింగ్ ప్రక్రియను చేపడతాయి.
- ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్: ఆర్మీ డెంటల్ క్రాప్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సంబంధిత సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చివరి తేదీ: 24.01.2022
- అడ్మిట్‌కార్డ్ విడుదల: మార్చి 01, 2022
- పరీక్ష తేదీ: మార్చి 06, 2022
- వెబ్‌సైట్: https://nbe.edu.in
చదవండి: MCC: ఆలిండియా మెడికల్ ప్రవేశాలు.. కౌన్సెలింగ్‌కు చివరి తేదీ ఇదే..