CSIR UGC NET 2025 Answer Key : సీఎస్ఐఆర్ యూజీసీ ఫైనల్ కీ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

సాక్షి ఎడ్యుకేషన్: ఎన్‌టీఏ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2025 డిసెంబర్ సెషన్ పరీక్షకు తుది సమాధాన కీలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు వారి పరీక్షకు సంబంధించి తుది కీ, ప్రశ్నాపత్రాలు, వారి రికార్డ్ చేసిన ప్రతిస్పందనలను అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, తెలుసుకోవచ్చు.. csirnet.nta.ac.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇక, ఎన్‌టీఏ ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి, 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 164 నగరాల్లో 326 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా, 2,38,451 మంది అభ్యర్థుల కోసం పరీక్షను నిర్వహించారు. దీని తర్వాత, తాత్కాలిక సమాధాన కీ మార్చి 11న విడుదల చేశారు. ఇక, గురువారం.. ఏప్రిల్ 17, 2025న తుది సమాధాన కీ విడుదలైంది.
హాజరు సంఖ్య..
ఎన్‌టీఏ నిర్వహించిన సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2025 పరీక్షను మూడు రోజులపాటు నిర్వహించారు. ఇందులో, తొలి రోజు నిర్వహించిన పరీక్షలో రెండు షిఫ్ట్‌లలో విద్యార్థుల సంఖ్య.. 75,484 కాగా, రెండో రోజు రెండు షిఫ్ట్‌ల్లో.. 72,009, ఇక మూడో రోజు.. 26,202 మంది హాజరైయ్యారు.
JEE Main Session II Final Key : జేఈఈ మెయిన్ ఫైనల్ కీ విడుదల... రిజల్ట్స్ మాత్రం అప్పుడే...
డౌన్‌లోడ్ ఇలా..
1. csirnet.nta.ac.inను సందర్శించండి.
2. ఇక్కడ, మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.. (అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ)
3. సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేస్తే, మీ స్కోర్ కార్డు కనిపిస్తుంది.
4. ఇక, దానిని పరిశీలించుకొని, డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- ugc net 2025
- Answer Key Release
- National Testing Agency
- National level exam
- exam answer key of ugc net
- CSIR UGC NET 2025 Answer Key
- April 17th
- Download CSIR UGC NET 2025 Answer Key 2025
- CSIR UGC NET Answer key download details in telugu
- CSIR UGC NET Answer Key PDF Download 2025
- CSIR UGC NET 2025 December Session Answer Key
- CSIR UGC NET Exam 2025 December Session updates in telugu
- Education News
- Sakshi Education News
- CSIRNETResults
- CSIRNETResponseSheet
- CSIRNETQuestionPapers
- CSIRNETAnswerKey