Skip to main content

Good News for Teachers: ఆరోపణలు లేని టీచర్లు కొంతకాలం కొనసాగుతారు

న్యూఢిల్లీ: అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందిన 25,753 మంది టీచర్లు, బోధనేతర సిబ్బందిని తొలగించేలా గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం, ఆ తీర్పు కారణంగా ఉద్యోగం కోల్పోయిన కొందరు టీచర్లకు ఊరట కల్పించింది.
teachers unaccused allowed continue job supreme court verdict

‘‘ఈ 25,753 మందిలో కొందరికి ఈ కుంభకోణంతో ఎలాంటి సంబంధం లేదని సీబీఐ స్పష్టంచేసింది. అందులో భాగంగా, ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలో 9వ, 10వ, 11వ, 12వ తరగతులను బోధించే, ఎలాంటి ఆరోపణలు లేని టీచర్లకు ఉద్యోగంలో కొనసాగేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించాం.

వీరు ఈ ఏడాది డిసెంబర్‌ 31వ తేదీ వరకు మాత్రమే ఉద్యోగం కొనసాగించవచ్చు. అయితే, బోధనేతర గ్రూప్‌ C, గ్రూప్‌ D ఉద్యోగులు విధుల్లో కొనసాగలేరు’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం స్పష్టంచేసింది.

చదవండి: ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం.. ఆ దేశం నుంచి స్పష్టత రాక ఆందోళన!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 18 Apr 2025 04:18PM

Photo Stories