MCC: ఆలిండియా మెడికల్ ప్రవేశాలు.. కౌన్సెలింగ్‌కు చివరి తేదీ ఇదే..
Sakshi Education
అఖిల భారత కోటా ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల ప్రక్రియ జనవరి 12 నుంచి ప్రారంభం అవుతుందని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) జనవరి 11న ప్రకటించింది. అఖిల భారత కోటా ప్రవేశాలతోపాటు రాష్ట్రాల్లో కనీ్వనర్ కోటా ప్రవేశాల తేదీలను కూడా వెల్లడించింది.
ఆలిండియా మెడికల్ ప్రవేశాలు..
ఆలిండియా తొలి విడత కౌన్సెలింగ్ జనవరి 12 నుంచి 21 వరకు కొనసాగుతుంది. కాలేజీల్లో జనవరి 28 నాటికి చేరాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో తొలివిడత కనీ్వనర్ కోటా సీట్ల కౌన్సెలింగ్ జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరి 2 నాటికి చేరాల్సి ఉంటుంది.
ఆలిండియా కోటా రెండోవిడత కౌన్సెలింగ్ వచ్చే ఫిబ్రవరి 3 నుంచి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 19 వరకు చేరాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో రెండోవిడత కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు కొనసాగుతుంది. వాటిల్లో 21వ తేదీ నాటికి చేరాలి.
ఆలిండియా కోటా సీట్లకు మాప్‌అప్ రౌండ్ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు మార్చి 10 నాటికి చేరాల్సి ఉం టుంది. ఇక రాష్ట్రాల్లో మాప్ అప్ రౌండ్ ఫిబ్రవరి 25నుంచి 28వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు మార్చి 2 నాటికి చేరాల్సి ఉంటుంది.