Skip to main content

BS Murty: బయోమెడికల్, బయో ఇన్ఫర్మేటిక్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు ప్రారంభిస్తాం

రోడ్డు, జల, వాయు మార్గాల్లో అటానమస్‌ వెహికిల్స్‌ (మానవరహిత వాహనాల) దూసుకెళ్లేలా చేయడంపై తాము చేపట్టిన పరిశోధన తుది దశకు చేరుకుంటోందని, ఆరు నెలల్లో ఆయా వాహనాల టెస్ట్‌రన్ ప్రారంభిస్తామని హైదరాబాద్‌ ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి వెల్లడించారు.
BS Murty
బయోమెడికల్, బయో ఇన్ఫర్మేటిక్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు ప్రారంభిస్తాం

సంగారెడ్డి జిల్లాలోని కందిలో ఉన్న తమ ఐఐటీ క్యాంపస్‌ ప్రాంగణంలోనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 28న ఐఐటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 5జీ టెక్నాలజీపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు కొనసాగుతున్నాయని, సెమీకండక్టర్ల ఉత్పత్తి రంగంలో తైవాన్ సంస్థలతో కలసి పనిచేస్తున్నామన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన రెండు ప్రఖ్యాత యూనివర్సిటీలతో కలసి ఇంజనీరింగ్‌లో డ్యూయల్‌ డిగ్రీ కోర్సులను కొనసాగిస్తున్నామని మూర్తి చెప్పారు. ప్రస్తుతం ఆరు ఆన్ లైన్ ఎంటెక్‌ కోర్సులు కొనసాగుతున్నాయని వివరించారు. సంస్కృత భాషలో ఉన్న విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు పలు కోర్సులను కొనసాగిస్తున్నామన్నారు. కొత్తగా బయో మెడికల్, బయో ఇన్ఫర్మేటిక్‌ ఇంజనీరింగ్‌ కోర్సులను ప్రారంభిస్తామని ప్రకటించారు. లోతైన సాంకేతిక ఆవిష్కరణల ద్వారా ఐఐటీ క్యాంపస్‌ సమీప గ్రామాల ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కార్యక్రమాలను చేపడతామన్నారు.

హైదరాబాద్‌కు ‘సిలికాన్ వ్యాలీ’సత్తా..

టెక్నాలజీ రంగంలో సిలికాన్ వ్యాలీ స్థాయికి ఎదిగేంత సత్తా హైదరాబాద్‌కు ఉందని బీఎస్‌ మూర్తి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికే టీ–హబ్‌తో కలిసి పనిచేస్తున్నామని, రానున్న రోజుల్లో టీ హబ్‌తో కలిసి మరిన్ని ప్రాజెక్టులు చేపడతామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ ఎండీసీ (జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ) రూ.పదికోట్ల ఆర్థిక సహాయంతో స్టార్టప్‌లపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్‌తోపాటు, అధికారులు జయేష్రంజన్, నవీన్ మిట్టల్‌ వంటి ఉన్నతాధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పారు. కాగా, 2019లో ప్రారంభమైన హైదరాబాద్‌ ఐఐటీలో రెండో విడత నిర్మాణాలను వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామని చెప్పారు. వీటిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారని పేర్కొన్నారు.

చదవండి: 

అమ్మాయిల ప్రవేశాలు ఏడేళ్లలో రెట్టింపు

Highest Package: ఇండియ‌న్ విద్యార్ధులకు జాక్‌ పాట్‌..శాలరీ రూ.2.16 కోట్లు..!

IIT Jobs: ఐఐటీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌.. ఏడాదికి రూ.2కోట్లకు పైగా వేత‌నం..

Published date : 29 Dec 2021 04:43PM

Photo Stories