Highest Package: ఇండియన్ విద్యార్ధులకు జాక్ పాట్..శాలరీ రూ.2.16 కోట్లు..!
ఇటీవల ఐఐటీ బాంబే ఫస్ట్ ఫేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో ఐఐటీ బాంబే విద్యార్ధులు జాక్ పాట్ కొట్టేశారు.క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో కోటి రూపాయలకు పైగా జీతంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించారు.
12మంది విద్యార్ధులు కోటికి పైగా శాలరీ..
క్యాంపస్ ఇంటర్వ్యూలో 1382 ఉద్యోగాలు సాధించగా అందులో 45 ఇంటర్నేషనల్ కంపెనీలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. 18 రోజుల పాటు జరిపిన ఫస్ట్ ఫేజ్ క్యాంపస్ సెలక్షన్‌లో 12మంది విద్యార్ధులు కోటికి పైగా శాలరీ తీసుకోనున్నారని, ఇదే ఫస్ట్ ఫేజ్ ఇంటర్వ్యూలో తొలి రికార్డ్‌గా నమోదైనట్లు ఎలైట్ టెక్ అండ్ ఇంజనీరింగ్ స్కూల్ ప్రతినిధులు వెల్లడించారు.
315 కంపెనీలు..
డిసెంబర్ 18తో ముగిసిన ఫస్ట్ ఫేజ్ ఇంటర్వ్యూలో మొత్తం 1723 ఉద్యోగాలకు గాను 1382 ఉద్యోగాలకు విద్యార్ధులు ఎంపికైనట్లు ఐఐటీ బాంబే ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఇక ఇదే క్యాంపస్ ఇంటర్వ్యూలో 2019లో 1172 మంది, 2020లో 973 మంది సెలక్ట్ అయ్యారు.
ఇంటర్వ్యూ లేకుండానే జాబ్..
గతేడాది 182మంది ప్రీప్లేస్ మెంట్ ఆఫర్ పొందగా, ఈ ఏడాది 248 మంది విద్యార్ధులు ప్రీప్లేస్‌మెంట్ ఆఫర్(ఇంటర్నషిప్ త్వరాత ఇంటర్వ్యూతో సంబంధం లేకుండా జాబ్) దక్కించుకున్నారు. ఇంజనీరింగ్ టెక్నాలజీతో పాటు ఇద్దరు విద్యార్ధులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం సంపాదించారు. త్వరలో నిర్వహించే సెకండ్ ఫేజ్‌లో ఐఐటీ బాంబే యూనివర్సిటీ విద్యార్ధులు అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తారని ఐఐటీ బాంబే ధీమా వ్యక్తం చేసింది.
వార్షిక వేతనం రూ.2.16 కోట్లుతో..
ఐఐటీ బాంబే యూనివర్సిటీ ప్రకారం.. ఫస్ట్ ఫేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో విదేశీ కంపెనీల్లో ఏడుగురు విద్యార్ధులు వార్షిక వేతనం కోటి రూపాయలు ఉండగా..అధిక వార్షిక వేతనం రూ.2.16కోట్లుగా ఉంది. ఇక దేశీయ కంపెనీల్లో ఐదుగురు విద్యార్ధులు కోటి రూపాయలు శాలరీ దక్కించుకోగా.. వార్షిక వేతనం రూ.1.68కోట్లని ఐఐటీ బాంబే అధికారులు తెలిపారు.
యావరేజ్‌గా..
క్యాంపస్ ఇంటర్వ్యూలో సంవత్సరానికి యావరేజ్‌గా రూ.25లక్షలు జీతంగా అందుకోనున్నట్లు ఐఐటీ బాంబే తెలిపింది. ఫైనాన్షియల్ సెక్టార్‌లో యావరేజ్ శాలరీ రూ.28.4లక్షలు, ఐటీ-సాఫ్ట్‌వేర్ రంగంలో రూ.27.05లక్షలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టార్‌లో (ఆర్డీ) రూ.25.12లక్షలు, కన‍్సల్టింగ్ సెక్టార్‌లో యావరేజ్ శాలరీ రూ.18.02గా ఉన్నట్లు వెల్లడించింది.
45 అంతర్జాతీయ కంపెనీలు..
ఇక విదేశాలకు చెందిన కంపెనీలు భారతీయ విద్యార్ధులు ఎంపిక చేసుకోవడంలో పోటీ పడుతున్నట్లు తేలింది. ఐఐటీ బాంబే యూనిర్సిటీలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 45 అంతర్జాతీయ కంపెనీలు విద్యార్ధుల్ని సెలక్ట్ చేసుకోనేందుకు వచ్చినట్లు యూనివర్సిటీ ప్రతినిధులు చెప్పారు. వాటిలో యూఎస్, జపాన్, యూఏఈ, సింగపూర్, నెదర్లాండ్, హాంకాంగ్, తైవాన్ కంపెనీలు ఉన్నాయి.