IT Jobs for Inter Students : ఐటీ పరిశ్రమలో ఉద్యోగానికి ప్లేస్మెంట్ డ్రైవ్.. ఈ విద్యతోనే..!

శ్రీకాకుళం: ఇంటర్మీడియెట్ విద్యార్హతతో ఐటీ పరిశ్రమలోకి ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ విద్య డీవీఈఓ శివ్వాల తవిటినాయుడు తెలిపారు. బుదవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ 2023– 2024లో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఈ నెల 24న ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 24వ తేదీన జిల్లాలోని నరసన్నపేటలో ఉన్న జ్ఞానజ్యోతి డిగ్రీ కళాశాలలో ఉదయం 9గంటల నుంచి ఈ డ్రైవ్ మొదలవుతుందన్నా రు.
JNTUA: పీహెచ్‌డీకి దరఖాస్తుల ఆహ్వానం
ఇంటర్‌లో 75 శాతానికిపైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు. విద్యార్థులు ముందుగా కంపెనీ నిర్వహించే కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూలో అర్హత సాధించాల్సి ఉంటుందన్నారు. ఎంపికైన వారికి మధురైలో 3 నెలల తరగతులు, చైన్నెలో 9 నెలల ఇంటర్న్ షిప్ ఉంటుందని పేర్కొన్నా రు. ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు రూ.10 వేలు శిక్షణ భృతి ఇస్తారని, శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులకు ఏడాదికి రూ.1.70 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తారని అన్నారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత విద్య కోర్సులు అభ్యసించేందుకుగాను హెచ్‌సీఎల్ టెక్ సహాయం చేస్తుందని చెప్పారు.