Skip to main content

ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో 1120 పోస్టులు.. నెలకు రూ.ల‌క్ష 77 వేల వరకూ వేతనం

Employees State Insurance Corporation

ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ).. మెడికల్‌ కాలేజీలో పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఈఎస్‌ఐసీలో 1120 ఇన్సూరెన్స్‌ మెడికల్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–2(అల్లోపతి) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టు పేరు: ఇన్సూరెన్స్‌ మెడికల్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2(అల్లోపతి)
మొత్తం పోస్టుల సంఖ్య: 1120

విద్యార్హతలు

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. దాంతోపాటు ఇంటర్న్‌షిప్‌ కూడా పూర్తిచేయాలి.
  • వయసు: 31.01.2022 నాటికి 35ఏళ్లకు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్‌ వర్గాలకు వయోసడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన వారికి తుది ఎంపిక చేస్తారు. 

పరీక్ష విధానం 
ఈ పరీక్ష పూర్తిగా ఆన్‌ౖలñ న్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో జరుగుతుంది. రెండు సెక్షన్‌లుగా (సెక్షన్‌ 1–100 మార్కులు, సెక్షన్‌ 2–100మార్కులు) 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు. 

  • సెక్షన్‌–1: ఈ విభాగంలో జనరల్‌ మెడిసిన్‌ 80 ప్రశ్నలు–80 మార్కులు, అలాగే పీడియాట్రిక్స్‌ 20 ప్రశ్నలు–20మార్కులు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలకు–100 మార్కులు ఉంటాయి. 
  • సెక్షన్‌–2: ఈ విభాగంలో సర్జరీ 34, గైనకాలజీ అండ్‌ అబ్‌స్టెట్రిక్స్‌ 33, ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌ల నుంచి 33 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు.
  • ఈ పరీక్షలో ప్రశ్నలు అభ్యర్థుల ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ను పరీక్షించే విధంగా ఉంటాయి. 

ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ మొత్తం 50 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో సాధించిన మెరిట్‌తోపాటు ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.

వేతనం
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి లెవల్‌(10) పే మాట్రిక్స్‌ ప్రకారం–నెలకు రూ.56,100 –1,77,500 వరకు వేతనంగా లభిస్తుంది. వీటికి డీఏ, ఎన్‌పీఏ, హెచ్‌ఆర్‌ఏ ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్సులు అదనంగా పొందవచ్చు.

ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 31.12.2021
దరఖాస్తులకు చివరి తేదీ: 31.01.2022

వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/recruitment


చ‌ద‌వండి: NIH Recruitment: ఎన్‌ఐహెచ్, కోల్‌కతాలో 12 పోస్టులు.. నెలకు రూ.ల‌క్ష 12 వేల వరకూ వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories