Skip to main content

Admissions‌: ఐఐటీలో ఎంహెచ్‌ఆర్‌ఎం ప్రవేశాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

IIT Kharagpur MHRM admissions

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌íస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. మాస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌(ఎంహెచ్‌ఆర్‌ఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతుంది. ఇది ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌. దీని కాలవ్యవధి రెండేళ్లు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా వింటర్, సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లు ఉంటాయి.

ప్రోగ్రామ్‌ స్వరూపం
ఎంహెచ్‌ఆర్‌ఎం ప్రోగ్రామ్‌లో నాలుగు టర్మ్‌లు ఉంటాయి. 

  • మొదటి టర్మ్‌లో.. ఇండివిడ్యువల్‌ అండ్‌ గ్రూప్‌ డైనమిక్స్, ఆర్గనైజేషనల్‌ స్ట్రక్చర్‌ అండ్‌ డైనమిక్స్, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ ఎకనామిక్స్, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా, బిజినెస్‌ కమ్యూనికేషన్, సైకాలజీ టెస్టింగ్‌ అండ్‌ మెజర్‌మెంట్స్, బేసిక్‌ బిజినెస్‌ స్టాటిస్టిక్స్‌ కోర్సులు ఉంటాయి.
  • రెండో టర్మ్‌లో.. లీడర్‌షిప్, మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఛేంజ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ సిస్టమ్, ఇండస్ట్రియల్‌ రిలేషన్స్, మేన్‌ పవర్‌ ఎకనామిక్స్, పర్ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్, రీసెర్చ్‌ మెథడాలజీ, ఒక ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌(ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఎట్‌ వర్క్‌ కాన్‌ఫ్లిక్ట్‌ రిజల్యూషన్‌ అండ్‌ నెగోషియేషన్, ఐటీ అండ్‌ బిజినెస్‌ అప్లికేషన్‌) కోర్సులు చదవాల్సి ఉంటుంది. 
  • మూడో టర్మ్‌లో.. హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్, బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ పాలసీ, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వెల్‌నెస్, ప్రొడక్షన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్, కార్పొరేషన్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, పర్సనల్‌ గ్రోత్‌ కోర్సులతోపాటు ఒక ఎలక్టివ్‌ కోర్సు(ఆర్గనైజేషన్‌ సోషియాలజీ, హెచ్‌ఆర్‌ అనలిటిక్స్‌),ఒక ప్రాజెక్ట్‌ ఉంటాయి. 
  • నాలుగో టర్మ్‌లో.. బిజినెస్‌ సొసైటీ అండ్‌ ఎథిక్స్, కంపెన్సేషన్‌ మేనేజ్‌మెంట్, హ్యూమన్‌ రిసోర్స్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం, ఇంటర్నేషనల్‌ హెచ్‌ఆర్‌ఎం కోర్సులతో పాటు నాలుగు ఎలక్టివ్‌ కోర్సులు(హెచ్‌ఆర్‌ అకౌంటింగ్, నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్‌ హెచ్‌ఆర్‌ఎం, ఇంట్రడక్షన్‌ టు ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్, ఇంటర్‌పర్సనల్‌ కమ్యూనికేషన్స్‌), ఒక ప్రాజెక్ట్, కాంప్రహెన్సివ్‌ వైవా వోస్‌ ఉంటాయి.


అర్హతలు

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, మెడిసిన్‌ తదితర నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్‌ స్థాయి కోర్సులు పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదేని స్పెషలైజేషన్‌తో పీజీ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తుకు అర్హులే. 
  • జనరల్‌ ఓబీసీ అభ్యర్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగ అభ్యర్థులు 55శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ చదివే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు అక్టోబర్‌ 31, 2022 నాటికి సర్టిఫికేట్, మార్కులకు సర్టిఫికేట్స్‌ సబ్మిట్‌ చేయాలి. అంతేకాకుండా క్యాట్‌ 2021లో అర్హత సాధించడం తప్పనిసరి.


ఎంపిక  విధానం

  • అకడమిక్‌ మెరిట్, క్యాట్‌ 2021లో సాధించిన స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారికి పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి మెరిట్‌ ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు.


ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 07.02.2022
  • ఇంటర్వ్యూ: మార్చి రెండో వారంలో
  • సెలక్షన్‌లిస్ట్‌: ఏప్రిల్‌ 29– 04 మే 2022 వరకు
  • వెబ్‌సైట్‌: www.iitkgp.ac.in


చ‌ద‌వండి: NEET MDS 2022: దంత వైద్యంలో.. మాస్టర్స్‌

Last Date

Photo Stories