GPAT 2023 Notification: గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్)-2023
అర్హత: ఇంటర్మీడియట్ తర్వాత ఫార్మసీలో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. బీఫార్మసీ పరీక్షా ఫలితాలు వెలువడిన చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్(ఫార్మాస్యూటికల్ అండ్ ఫైన్ కెమికల్ టెక్నాలజీ)/తత్సమాన అభ్యర్థులు దీనికి అర్హులు కాదు.
వయసు: జీప్యాట్-2023 దరఖాస్తుకు వయసుతో సంబంధం లేదు.
పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో అడుగుతారు. మొత్తం 500 మార్కులకు-125 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.03.2023.
వెబ్‌సైట్: https://gpat.nta.nic.in/