Skip to main content

Admissions: ఒక్క రూపాయి కట్టకుండానే బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేయాలనుకుంటున్నారా... అయితే ఈ వార్త మీకోసమే...

వైద్య రంగంలో రాణించాలనుకునే యువతకు ఇదే సువర్ణావకాశం. నర్సింగ్‌ కోర్సులకు ఉన్న క్రేజ్‌ తెలిసిందే. నాలుగేళ్ల నర్సింగ్‌ పూర్తి చేస్తే కార్పొరేట్‌ ఆస్పత్రులతో పాటు విదేశాల్లోనూ సమృద్ధిగా అవకాశాలు ఉన్నాయి.
Sri Sathya Sai Institute of Higher Medical Sciences

నర్సింగ్‌తో పాటు మరికొన్ని కోర్సులను పూర్తి ఉచితంగా ఓ కాలేజీ అందిస్తోంది. నాలుగేళ్ల పాటు ఉండే  ఈ కోర్సుల్లో విద్యార్థులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఖర్చు మొత్తం కాలేజీ యాజమాన్యమే భరిస్తుంది. ఆ కాలేజీ పేరు.. ఎక్కడ ఉందో తెలుసుకుందామా.
నాలుగేళ్ల పాటు కోర్సులు...
బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ మెడికల్‌ సైన్సెస్‌ పూర్తి ఉచితంగా కొన్ని కోర్సులను అందిస్తోంది. బీఎస్సీ నర్సింగ్, అనస్తీషియా, ఆపరేషన్‌ టెక్నాలజీ, మెడికల్‌ లాబొరేటరీ టెక్నాలజీ, ఇమాజింగ్‌ టెక్నాలజీ, కార్డియాక్‌ కేర్‌ టెక్నాలజీ, పెర్ఫూజన్‌ టెక్నాలజీ... మొదలైన వాటిని అందిస్తోంది. అయితే ఇక్కడ కేవలం విద్యార్థినులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కోర్సుల వ్యవధి నాలుగేళ్లపాటు ఉంటుంది. రెసిడెన్షియల్‌ క్యాంపస్‌ పరిధిలో తరగతులు నిర్వహిస్తారు.
నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకోవాలి
17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంటర్, పీయూసీ పూర్తి చేసి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులుగా తీసుకున్న వారు మాత్రమే అర్హులు. అలాగే 45 శాతం మార్కులు ఆయా సబ్జెక్టులలో తెచ్చుకుని ఉండాలి. ఆశావహులైన అభ్యర్థులు కాలేజీ వెబ్‌సైట్‌లోకి నిర్ణీత ఫార్మాట్‌లో అప్లికేషన్‌ ఫిల్‌ చేసి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు ఏప్రిల్‌ 1, 2023 నుంచి మే 31, 2023 వరకు అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు https://sssihms.org సందర్శించండి.

Photo Stories