Admission in C-DAC: సీ–డ్యాక్‌లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీ–డ్యాక్).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో మార్చి 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు: అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, ఎంబడెడ్ సిస్టమ్స్ డిజైన్, బిగ్ డేటా అనలిటిక్స్, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, వీఎల్‌ఎస్‌ఐ yì జైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్ కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ సెక్యూర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, జియోఇన్ఫర్మేటిక్స్, రోబోటిక్స్ అండ్ అల్లైడ్ సైన్సెస్, హెచ్‌పీసీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్(10+2+4)/10+3+3)/కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/ఎంఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: సీడ్యాక్ కామన్ అడ్మిషన్ టెస్ట్(సీ–సీఏటీ) ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.01.2022
సీ–సీఏటీ పరీక్ష తేదీలు: 2022 జనవరి 22, 23
దేశవ్యాప్తంగా పీజీ డిప్లొమా కోర్సులు ప్రారంభయ్యే తేది: 2022, మార్చి 08.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://cdac.in
చదవండి: CLAT: కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) –2022... దరఖాస్తులకు చివరి తేది...