CLAT: కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) –2022... దరఖాస్తులకు చివరి తేది...
దేశవ్యాప్తంగా ఉన్న 21 నేషనల్ లా యూని వర్సిటీల కన్సార్టియం.. లా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) –2022కు నోటిఫికేషన్ విడుదల చేసింది. క్లాట్ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది.
» ఎంట్రెన్స్ టెస్ట్: కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)–2022
అర్హతలు
- అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్(ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ): కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీసం 40 శాతం మార్కులు రావాలి. మార్చి/ఏప్రిల్ 2022లో ఇంటర్మీడియెట్ ఫైనల్ పరీక్షలు రాయనున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్(ఒక ఏడాది ఎల్‌ఎల్‌ఎం): కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
- » దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- » దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.01.2022
- » దరఖాస్తులకు చివరి తేది: 31.03.2022
- » క్లాట్ పరీక్ష తేది: 08.05.2022
- » వెబ్‌సైట్: https://consortiumofnlus.ac.in/
Last Date