Skip to main content

TISS Notification 2021: యూజీ కోర్సుల కోసం.. టిస్‌ బాట్‌ నోటిఫికేషన్‌ విడుదల

సోషల్‌ సైన్స్‌లో యూజీ కోర్సులు నోటిఫికేషన్‌ విడుదల చేసిన టిస్‌ టిస్‌ బాట్‌.. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ బ్యాచిలర్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌! జాతీయ స్థాయిలో జరిగే అర్హత పరీక్ష ఇది. ప్రముఖ విద్యా సంస్థ.. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌).. సోషల్‌ సైన్సెస్‌ విభాగంలో.. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతి ఏటా టిస్‌ బాట్‌ను నిర్వహిస్తుంది. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులకు టిస్‌ క్యాంపస్‌ల్లో బీఏ సోషల్‌ సైన్సెస్‌ కోర్సుల్లో అడ్మిషన్‌ లభిస్తుంది. ప్రస్తుతం టిస్‌ బాట్‌–2021 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. టిస్‌ అందించే కోర్సులు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం తదితర అంశాలపై ప్రత్యేక కథనం..
TISS Notification 2021

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న టిస్‌కు దేశ వ్యాప్తంగా హైదరాబాద్, గౌహతి,  తుల్జాపూర్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఆయా క్యాంపస్‌లల్లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ నుంచి పీహెచ్‌డీ వరకూ.. పలు సోషల్‌ సైన్సెస్‌ కోర్సులను అందిస్తున్నారు. ఈ కోర్సులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ప్రతి ఏటా టిస్‌బాట్‌ను నిర్వహించి అర్హులైన విద్యార్థులకు బీఏ సోషల్‌వర్క్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్, బీఏ సోషల్‌ సైన్సెస్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.

అర్హతలు

  • టిస్‌బాట్‌ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ఏదైనా గ్రూప్‌తో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యలో ఉత్తీర్ణులై ఉండాలి. 
  • 18.09.2021 నాటికి జనరల్‌అభ్యర్థులకు గరిష్ట వయసు 20 ఏళ్లు, ఓబీసీలకు 22 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 24ఏళ్ల లోపు ఉండాలి. 


పరీక్ష ఇలా
టిస్‌బాట్‌ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో ఆర్‌పీఏ (రిమోట్‌ ప్రొక్టోరింగ్‌ అసెస్‌మెంట్‌) పద్ధతిలో నిర్వహిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌(ఎంసీక్యూ) తరహా ప్రశ్నలుంటాయి. మొత్తం మూడు విభాగాల నుంచి 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. నెగిటివ్‌మార్కుల విధానం లేదు.

మూడు విభాగాలు

  • వెర్బల్‌ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు–20 మార్కులు; మ్యాథమెటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 20 ప్రశ్నలు–20 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌పై 20 ప్రశ్నలు–20 మార్కులకు పరీక్ష జరుగుతుంది.  


వెర్బల్‌ ఎబిలిటీ
వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగంలో.. యూసెజ్‌ ఆఫ్‌ ఇడియమ్స్, ఫిల్‌ఇన్‌ద బ్లాంక్స్, ఆడ్‌వర్డ్‌ అవుట్, జంబ్లింగ్‌సెంటెన్సెస్, సినానిమ్స్, యాంటానిమ్స్, వర్డ స్పెల్లింగ్స్, సెంటెన్స్‌కరెక్షన్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి ప్రశ్నలను అడుగుతారు.

ఇంగ్లిష్‌
ఇంగ్లిష్‌ విభాగంలో.. ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, డేటా ఇంటర్‌ ప్రిటేషన్స్, బార్‌గ్రాఫ్స్, పైచార్ట్స్, టైమ్‌– డిస్టెన్స్, టైమ్‌–వర్క్, యావరేజెస్, సింపుల్‌ ఇంట్రెస్ట్, కాంపౌండ్‌ ఇంట్రెస్ట్, జామెట్రీ, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియో–ప్రపోర్షన్, వేరియేషన్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

మ్యాథమెటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌
ఇందులో ఆల్ఫాబెట్‌ అండ్‌ నంబర్‌ సిరీస్‌; ఫ్యామిలీ అండ్‌ సర్క్యులర్‌ అరేంజ్‌మెంట్, లాజికల్‌ కనెక్టివిటీ, కోడింగ్‌ అండ్‌ డీకోడింగ్, డైరెక్షన్స్, పజిల్స్, క్లాక్‌ అండ్‌ కేలండర్, క్యూబ్స్, స్టేట్‌మెం ట్‌–కంక్లూజన్స్‌విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి.

జనరల్‌ అవేర్‌నెస్‌
జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో..జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌అఫైర్స్, మీడియా అండ్‌ అడ్వర్‌టైజ్‌మెంట్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, అవార్డులు, హెల్త్, టెక్నాలజీ, ఎన్విరాన్‌ మెంట్‌ అండ్‌ నేచర్, స్పోర్ట్స్, మ్యూజిక్, ఫిలింస్, నియామకాలు తదితరాలపై ప్రశ్నలు వస్తాయి. 

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 13.09.2021
టీస్‌ బ్యాట్‌ పరీక్ష తేదీ: 19.09.2021

వెబ్‌సైట్‌: https://admissions.tiss.edu/  https://appln.tiss.edu

Last Date

Photo Stories