TTWREIS Admission 2023: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్‌లో ప్రవేశాలు
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్ యూఆర్‌జేసీ).. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 103 గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలచేసింది. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్య వసతితోపాటు ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, వృత్తి విద్యా కోర్సులు.
బోధనా మాధ్యమం: ఇంగ్లిష్.
అర్హత: మార్చి–2023లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000(పట్టణ ప్రాంతం), రూ.1,50,000(గ్రామీణ ప్రాంతం) మించకూడదు. ఇంగ్లిష్/తెలుగు మాధ్యమం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: విద్యార్థుల వయస్సు 31.08.2023 నాటికి 17 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:15.06.2023
వెబ్‌సైట్: https://tgtwgurukulam.telangana.gov.in/
AP Fisheries University: ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం, విజయవాడలో డిప్లొమాలో ప్రవేశాలు
Last Date