Skip to main content

NIMS, Hyderabad: నిమ్స్, హైదరాబాద్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ కోర్సు ప్రవేశాలు

NIMS Hyderabad

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌).. 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ(ఎంపీటీ)కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: మస్క్యులోస్కెలిటల్‌ సైన్సెస్, కార్డియోవాస్క్యులార్‌ అండ్‌ పల్మనరీ సైన్సెస్, న్యూరో సైన్సెస్‌.
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: ఫిజియోథెరపీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 31.12.2021 నాటికి 22–35ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసోసియేట్‌ డీన్, అకడమిక్‌–2, సెకండ్‌ ఫ్లోర్, ఓల్డ్‌ ఓపీడీ బ్లాక్, నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, హైదరాబాద్‌–500082 చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 16.10.2021

వెబ్‌సైట్‌: https://www.nims.edu.in

చ‌దవండి: NICMAR Pune Admission: నిక్‌మార్, పుణెలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

Last Date

Photo Stories