NIT, Andhra Pradesh: ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు.. అర్హతలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. 2022–24 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)
కోర్సు వ్యవధి: రెండేళ్లు(ఫుల్‌టైం)
మొత్తం సీట్ల సంఖ్య: 60
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. చివరి ఏడాది /సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్న(లేదా) ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వాలిడ్ క్యాట్/సీమ్యాట్/మ్యాట్ /జీమ్యాట్/ఇతర జాతీయ స్థాయి పరీక్షల స్కోర్ ఉండాలి.
ఎంపిక విధానం: వాలిడ్ క్యాట్/సీమ్యాట్/మ్యాట్/జీమ్యాట్/ఇతర జాతీయ స్థాయి పరీక్షల స్కోర్, అకడమిక్ మెరిట్, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.10.2021
వెబ్‌సైట్: https://www.nitandhra.ac.in
చదవండి: Central Tribal University: సీటీయూలో ప్రవేశాలు.. కోర్సుల వివరాలు ఇలా..