Central Tribal University: సీటీయూలో ప్రవేశాలు.. కోర్సుల వివరాలు ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో ఏర్పాటైన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ– సీటీయూ).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
ఎమ్మెస్సీ కెమిస్ట్రీ(మెడిసినల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్); ఎంఏ సోషియాలజీ; మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్(ఎంఎస్‌డబ్ల్యూ); మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్(ఎంజేఎంసీ); మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ); మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఇంగ్లిష్; బీఎస్సీ+ఎమ్మెస్సీ కెమిస్ట్రీ(మెడిసినల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్); బీబీఏ+ఎంబీఏ(టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్); బీఎస్సీ +ఎమ్మెస్సీ(జియాలజీ); బీఎస్సీ+ఎమ్మెస్సీ(బోటనీ); బీకాం ఒకేషనల్; బీఎస్సీ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్).
అర్హత: కోర్సులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2), బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 20.10.2021
వెబ్‌సైట్: https://www.ctuap.ac.in
చదవండి: PG Courses in OU: పార్ట్‌టైం ఇంజనీరింగ్ పీజీలో ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇలా..