APPSC-RIMC: ఏపీపీఎస్సీ–ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు
అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2024 జనవరి నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
వయసు: 01.01.2024 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా.. పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. 02.01.2011 నుంచి 01.07.2012 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, వైవా వాయిస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: రాతపరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి.. మ్యాథమేటిక్స్(200 మార్కులు), జనరల్ నాలెడ్జ్(75 మార్కులు), ఇంగ్లిష్(125 మార్కులు)నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవా వాయిస్(50 మార్కులు) నిర్వహిస్తారు. రాతపరీక్ష, వైవా వాయిస్ కలిపి మొత్తం 450 మార్కులు కేటాయించారు. దీనిలో కనీస ఉత్తీర్ణత మార్కులు 50% ఉండాలి. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఆర్‌ఐఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి ఏపీపీఎస్సీ చిరునామకు పంపించాలి.
పరీక్షా కేంద్రం: హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 15.04.2023.
పరీక్ష తేది: 03.06.2023.
వెబ్‌సైట్: https://psc.ap.gov.in/
BLV CET 2023: టీఎస్‌డబ్ల్యూఆర్, టీటీడబ్ల్యూఆర్.. బీఎల్‌వీసెట్-2023