Skip to main content

Admission in IIT Delhi: ఐఐటీ ఢిల్లీలో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు

న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌(మొదటి సెమిస్టర్‌)లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Admission in IIT Delhi

కోర్సులు: పీహెచ్‌డీ, ఎంటెక్, ఎంఎస్‌(రీసెర్చ్‌), ఎం.డిజైన్, ఎంపీపీ, ఎంఎస్సీ(హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌).
విభాగాలు: అప్లైడ్‌ మెకానిక్స్, బయోకెమికల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, డిజైన్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ తదితరాలు.
అర్హత: పీజీ కోర్సులో ప్రవేశానికి సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో బ్యాచిలర్‌ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలకు సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో పీజీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్‌ విభాగలకు గేట్, డిజైన్‌ విభాగాలకు సీడ్‌ వ్యాలిడ్‌ స్కోరు సాధించి ఉండాలి. ఎమ్మెస్సీ కాగ్నిటివ్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌కు గేట్‌/జామ్, జేఆర్‌ఎఫ్, నెట్‌ వ్యాలిడ్‌ స్కోరు సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.03.2023.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://iitd.ac.in/

Admission in IIM Indore: ఐఐఎం ఇండోర్‌లో ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఐపీఎం)-2023లో ప్రవేశాలు

Last Date

Photo Stories