Skip to main content

NCHM JEE 2022: బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు

NTA – NCHM JEE 2022

బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు శుభవార్త. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) 2022 ఏడాదికి గాను నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 2022–23 సంవత్సరానికి దేశవ్యాప్తంగా బీఎస్సీ (హాస్పిటల్, హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

వివరాలు
నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌  ఎగ్జామినేషన్‌ (ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ) 2022
»    అర్హత: ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా  ఇంటర్మీడియట్‌ (10+2)/తత్సమాన  ఉత్తీర్ణత. ఇంటర్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు  కూడా దరఖాస్తుకు అర్హులే.
»    వయసు: 01.07.2022 నాటికి జనరల్, ఓబీసీ అభ్యర్థులు గరిష్ట  వయసు 25 ఏళ్లు,  ఎస్సీ/ ఎస్టీ దివ్యాంగులకు 28 ఏళ్లకు మించకూడదు.

Also read: Admissions in FRI: ఎఫ్‌ఆర్‌ఐ, డెహ్రాడూన్‌లో ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

ఎంపిక విధానం
కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్ష విధానం: ఈ పరీక్ష మల్టిపుల్‌  ఛాయిస్‌ ప్రశ్నల(ఎంసీక్యూ) రూపంలో ఉంటుంది. మొత్తం ఐదు విభాగాల నుంచి 200 ప్రశ్నలుంటాయి. ఇందులో న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ అనలైటికల్‌ ఆప్టిట్యూడ్‌–30 ప్రశ్నలు, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌–30, జనరల్‌ నాలెడ్జ్‌  అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌–30,ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ల –60, ఆప్టిట్యూడ్‌ ఫర్‌ సర్వీస్‌ సెక్టార్‌ల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ఫ్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు.

Also read: NIT Warangal: నిట్, వరంగల్‌లో ఎంబీఏ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివ‌రి తేదీ ఇదే..

నెగిటివ్‌ మార్కులు
ఈ పరీక్షలో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం అమలులో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోతగా విధిస్తారు. ప్రశ్నపత్నం హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్షకు  3గంటల (180నిమిషాల) సమయం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు
జనరల్‌ /ఓబీసీ అభ్యర్థులు రూ.1000, జనరల్‌‡–ఈడబ్ల్యూఎస్‌–రూ.700, ఎస్సీ/ఎస్టీ/ట్రాన్స్‌జెండర్, దివ్యాంగులు రూ.450 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.

Also read: Admissions in AIIMS: ఐఎన్‌ఐ– సెట్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ముఖ్యమైన సమాచారం
»    దరఖాస్తు  విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    దరఖాస్తులకు చివరి తేదీ: 03.05.2022
»    పరీక్ష తేదీ: 28.05.2022
»    వెబ్‌సైట్‌: https://nchmjee.nta.nic.in

Last Date

Photo Stories