Skip to main content

ఏపీఆర్‌జేసీ/ఆర్‌డీసీల్లో ప్రవేశాలు.. దరఖాస్తు చివరి తేది ఇదే..

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పదో తరగతి పాసైనవారు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలోని గ్రూప్‌ల్లో చేరేందుకు అర్హులు. అలాగే ఇంటర్ పాసైన విద్యార్థులు డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని 10 జూనియర్ కళాశాలలతో పాటు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ కళాశాల, నాగార్జున సాగర్; సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల(కర్నూల్)లో ప్రవేశం పొందొచ్చు. జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన విద్యార్థులు మాత్రమే అర్హులు. కాగా, డిగ్రీ కళాశాలల్లోకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంత విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
జూనియర్ కళాశాలలకు అర్హతలు
2020 మార్చి/ఏప్రిల్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు మాత్రమే ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులు. ఓసీ విద్యార్థులు 6 జీపీఏ, బీసీ/ఎస్సీ/ఎస్టీ/మైనార్టీలకు 5జీపీఏ తప్పనిసరి. అన్ని కేటగిరీల విద్యార్థులకు ఇంగ్లీష్‌లో 4 జీపీఏ సాధించాలి.

జూనియర్ కళాశాలలకు అర్హతలు
2020 మార్చి/ఏప్రిల్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు మాత్రమే ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులు. ఓసీ విద్యార్థులు 6 జీపీఏ, బీసీ/ఎస్సీ/ఎస్టీ/మైనార్టీలకు 5జీపీఏ తప్పనిసరి. అన్ని కేటగిరీల విద్యార్థులకు ఇంగ్లీష్‌లో 4 జీపీఏ సాధించాలి.

గ్రూపులు-శిక్షణ
ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రవేశం పొందొచ్చు. వీటితో పాటు ఒకేషనల్ కోర్సులైన ఈఈటీ, సీజీటీ అందిస్తున్నారు. అన్ని కోర్సులు ఇంగ్లీష్ మీడియంలో కొనసాగుతాయి. ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా, ఆయా వర్గాలకు ప్రభుత్వ రిజర్వేషన్లను అనుసరించి సీట్లు కేటాయిస్తారు. ఆయా కళాశాలల్లో పూర్తి రెసిడెన్షియల్ విద్యతో పాటు ఎంసెట్, నీట్, ఐఐటీ, సీఏ-సీపీటీ తదితర పోటీ పరీక్షలకు ఉన్నత స్థాయి శిక్షణనిస్తారు.

ప్రవేశ పరీక్ష విధానం
ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష 150 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఈ ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రంలో.. ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్‌సైన్స్; బైపీసీ విద్యార్థులకు ఇంగ్లీష్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్; సీఈసీ/ఎంఈసీ విద్యార్థులకు ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్; ఈఈటీ విద్యార్థులకు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్; సీజీటీ విద్యార్థులకు ఇంగ్లీష్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నపత్రం పదో తరగతి స్థాయిలో ఉంటుంది.

ఏపీఆర్‌డీసీకి అర్హతలు
ఈ విద్యా సంవత్సరం(2020)లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంత విద్యార్థులు అర్హులు. అన్ని సబ్జెక్టుల్లో 50 శాతం, ఇంగ్లీష్‌లో 40 శాతం మార్కులు తప్పనిసరి. బీసీ/ఎస్సీ/ఎస్టీలకు 5 శాతం మార్కుల సడలింపు ఉంది. ఇంటర్మీడియెట్‌లో ఆర్‌‌ట్స, కామర్స్, సైన్స్ కోర్సులకు అనుగుణంగా డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

అందుబాటులో ఉన్న కోర్సులు
నాగార్జున సాగర్(పురుషులు)లో.. బీఏ(హెచ్‌ఈపీ), బీకామ్ (జనరల్), బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ), బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటస్టిక్స్, కంప్యూటర్ సైన్స్).
సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల(కర్నూలు-కో ఎడ్యుకేషన్)లో.. బీఏ(హెచ్‌ఈపీ), బీఏ(హిస్టరీ, ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్), బీకామ్ (జనరల్), బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, వెబ్ టెక్నాలజీ), బీఎస్సీ(బోటనీ, మైక్రో బయోలజీ, కెమిస్ట్రీ), బీఎస్సీ(జువాలజీ, బోటనీ, కెమిస్ట్రీ), బీఎస్సీ(హార్టికల్చర్,బోటనీ,కెమిస్ట్రీ), బీఎస్సీ(జువాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ). అన్ని కోర్సులు ఇంగ్లీష్ మీడియంలో కొనసాగుతాయి.

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరి తేది:22 ఏప్రిల్ 2020
ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు: రూ.250
హాల్‌టికెట్ల జారీ: మే 8 నుంచి 14 వరకు
ఏపీఆర్‌జేసీ/డీసీ సెట్: 14 మే 2020
పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్: http://aprjdc.apcfss.in

Photo Stories