Skip to main content

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ 2021 నోటిఫికేష‌న్‌

ఐఐటీల్లో ప్రవేశాన్ని కల్పించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను అక్టోబర్‌ 3న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. ఈ పరీక్ష జూలై 3న జరగాల్సి ఉన్నప్పటికీ కోవిడ్‌ కారణంగా వాయిదా పడిన సంగ‌తి తెలిసిందే. అన్ని రకాల కరోనా నిబంధనలను పాటిస్తూ అక్టోబర్‌ 3న ఈ పరీక్ష జరుగునుంది. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివ‌రాలు...
  • జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ 2021

అర్హ‌త‌: అభ్యర్థులు 12 వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి/ ఇంట‌ర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సబ్జెక్జ‌ల‌తో ఉత్తీర్ణత లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తు ఫీజు:
  • జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు: రూ. 2800/-
  • ఎస్సీ/ఎస్టీ/విక‌లాంగుల‌కు/మ‌హిళ‌ల‌కు: రూ.1400/-

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: సెప్టెంబ‌ర్ 16, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://jeeadv.ac.in/index.php

Photo Stories