FADEE 2022 Notification: ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ).. ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఏడీఈఈ) 2022–23 ప్రకటన వెలువడింది. దీనిద్వారా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్ ఆఫ్ డిజైన్(బీ.డిజైన్) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత,ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్‌ఏ)
- మొత్తం సీట్లు: 210
- విభాగాలు: అప్లయిడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కలప్చర్, యానిమేషన్, ఫోటోగ్రఫీ.
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్(10+2)/తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రోగ్రామ్ కాలవ్యవధి
- ఒక్కో ప్రోగ్రామ్ కాలవ్యవధి నాలుగేళ్లు. బీఎఫ్‌ఏ కోర్సులో 5 స్పెషలైజేషన్లు ఉన్నాయి.
- రెగ్యులర్ కేటగిరీలో.. అప్లయిడ్ ఆర్ట్–35, పెయింటింగ్–20, స్కల్‌ప్చర్–10, ఫోటోగ్రఫీ 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- ఎస్‌ఎస్‌ఎస్ కేటగిరీలో.. అప్లయిడ్ ఆర్ట్–15, పెయింటింగ్–15, స్కల్‌ప్చర్–10, యానిమేషన్–60, ఫోటోగ్రఫీ–15 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- బీ.డిజైన్ కోర్సుల్లో.. ఇంటీరియర్ డిజైన్ స్పెషలైజేషన్ ఉంది. ఇందులో ఎస్‌ఎస్‌ఎస్ కేటగిరి కింద 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఎంపిక విధానం
ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఏడీఈఈ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
Admissions in BITS: బిట్స్‌లో బీఎస్సీ, ఎమ్మెస్సీ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
ఎఫ్‌ఏడీఈఈ
ఈ పరీక్షలో ఎ,బి,సి,డి,ఇ,ఎఫ్ అనే ఆరు పేపర్లు ఉంటాయి. బీఎఫ్‌ఏ (అప్లయిడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్‌ప్చర్, యానిమేషన్) ప్రోగ్రామ్‌లకు ఎ,బి,సి పేపర్లు, బీఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ) ప్రోగ్రామ్‌కు డి, ఇ పేపర్లు; బీ.డిజైన్(ఇంటీరియర్ డిజైన్) ప్రోగ్రామ్‌కు ఎఫ్ పేపర్ రాయాల్సి ఉంటుంది.
- ఎ పేపర్‌లో మెమొరీ డ్రాయింగ్ అండ్ కలరింగ్ ఎగ్జామ్ ఉంటుంది. దీన్ని 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం గంటన్నర .
- బి పేపర్‌లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి. దీనిలో 50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 50 నిమిషాలు.
- సి పేపర్‌లో ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం గంటన్నర.
- డి పేపర్‌లో 100 మార్కులకు కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష సమయం గంటన్నర.
- ఇ పేపర్‌లో 50 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 50 నిమిషాలు.
- ఎఫ్ పేపర్‌లో 200 మార్కులకు డిజైన్ సంబంధిత ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు.
- ఎగ్జామ్‌ను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించాలంటే.. కనీసం 35శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
- దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 20, 2022
- ఎఫ్‌ఏడీఈఈ పరీక్ష తేదీలు: 2022 జులై 02, 03 తేదీల్లో
- వెబ్‌సైట్: https://www.jnafauadmissions.com/