Admissions in BITS: బిట్స్‌లో బీఎస్సీ, ఎమ్మెస్సీ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
మెస్రా(రాంచీ)లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(బిట్స్).. జయపుర, నోయిడా ప్రాంగణాల్లో 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
బీఎస్సీ(యానిమేషన్ అండ్ మల్టీ మీడియా ప్రోగ్రామ్):
కోర్సు వ్యవధి: మూడేళ్లు (ఆరు సెమిస్టర్లు)ఫుల్ టైం;
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎమ్మెస్సీ(యానిమేషన్ డిజైన్ ప్రోగ్రామ్):
కోర్సు వ్యవధి: రెండేళ్లు(నాలుగు సెమిస్టర్లు) ఫుల్‌టైం;
అర్హత: బీఎస్సీ(యానిమేషన్/మల్టీ మీడియా)/బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్/బ్యాచిలర్ ఆఫ్ డిజైన్/బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: క్రియేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 14.06.2022
పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలు: జయపుర క్యాంపస్ 2022, జూన్ 24, 25, నోయిడా క్యాంపస్ 2022, జూన్ 27, 28 తేదీల్లో నిర్వహిస్తోంది.
వెబ్‌సైట్: http://www.bitmesra.ac.in/