Skip to main content

Postal Department Jobs: ఏపీ సర్కిల్‌లో 75 పోస్టులు.. అర్హతలు ఇవే

Post Department AP Circle Recruitment

ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ సర్కిల్‌ విభాగం.. స్పోర్ట్స్‌ కోటా కింద వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 75
పోస్టుల వివరాలు: పోస్టల్‌ అసిస్టెంట్‌–19, సార్టింగ్‌ అసిస్టెంట్‌–04, పోస్టల్‌ అసిస్టెంట్‌ ఇన్‌ సర్కిల్‌ ఆఫీస్‌/రీజినల్‌ ఆఫీస్‌–03, పోస్టల్‌ అసిస్టెంట్‌ ఇన్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌–04, పోస్ట్‌మ్యాన్‌–18, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌–27.
క్రీడలు: ఆర్చరీ, బాస్కెట్‌బాల్, బాడీ బిల్డింగ్, చెస్, సైక్లింగ్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, షూటింగ్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్‌(10+2) ఉత్తీర్ణులవ్వాలి. జాతీయ/అంతర్జాతీయ/ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. స్థానిక భాష(తెలుగు)లో మాట్లాడటం వచ్చి ఉండాలి.
వయసు: పోస్టల్‌ అసిస్టెంట్‌/సార్టింగ్‌ అసిస్టెంట్‌/పోస్టుమ్యాన్‌/మెయిల్‌ గార్డ్‌ పోస్టులకు 18–27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులకు 18–25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, క్రీడార్హతల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 27.11.2021

వెబ్‌సైట్‌: https://www.indiapost.gov.in


చ‌ద‌వండి: SAI Recruitment: సాయ్‌లో స్పోర్ట్స్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

Qualification 10TH
Last Date November 27,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories