Skip to main content

NFL Recruitment 2023: నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక

భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద ఎరువుల ఉత్పత్తి సంస్థ నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌).. పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీనిలో భాగంగా నోయిడాలోని ఎన్‌ఎఫ్‌ఎల్‌ దేశ వ్యాప్తంగా ఉన్న యూనిట్లు, కార్యాలయాల్లో 74 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపట్టనుంది.
Apply Now for Management Trainee Jobs, Fertilizer Manufacturing Unit, National Level Job Opportunities,Apply Now for Management Trainee Jobs,  NFL Offices Across the Country, NFL Recruitment Advertisement, 74 Management Trainee Positions, Noida Recruitment Center, Management Trainee Jobs in National Fertilizers Limited, NFL , "Government of India Seal,

డిగ్రీ, సీఏ, ఎంబీఏ విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్‌ 1తేదీ లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.

మొత్తం పోస్టుల సంఖ్య: 74(విభాగాల వారీగా.. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మార్కెటింగ్‌ )-60, ఎఫ్‌ అండ్‌ ఏ-10, లా-04 పోస్టులు)

అర్హతలు

  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(మార్కెటింగ్‌): ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు రెండేళ్ల ఫుల్‌టైమ్‌ ఎంబీఏ/పీజీడీబీఎం/పీజీడీఎం మార్కెటింగ్‌/అగ్రి బిజినెస్‌ మార్కెటింగ్‌/రూరల్‌ మేనేజ్‌మెంట్‌/ఫారిన్‌ ట్రేడ్‌/ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో పాసవ్వాలి.
  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఏ): ఈ పోస్టులకు సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. 
  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ లా: ఈ ఉద్యోగాలకు మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ డిగ్రీ/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఫుల్‌టైమ్‌ ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ డిగ్రీ 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 50% మార్కులు పొందాలి.
  • ఎన్‌ఎఫ్‌ఎల్‌ ఉద్యోగులు కరస్పాండెన్స్‌/పార్ట్‌టైమ్‌ డిగ్రీ/డిప్లొమా 50 శాతం మార్కులతో పాసైనా సరిపోతుంది.

వయసు
31.10.2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఓబీసీలకు మూ­డేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది.

చ‌ద‌వండి: Postal Jobs: 1,899 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. అర్హతలు, ఎంపిక విధానం విధానం ఇదే

ఎంపిక విధానం
ఆఫ్‌ౖ లెన్‌ ఓఎంఆర్‌ విధానంలో నిర్వహించే అర్హత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 100 ప్రశ్నలు సంబంధిత అకడమిక్‌ సబ్జెక్టుల నుంచి అడుగుతారు.జనరల్‌ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌/అవేర్‌నెస్‌కు సంబంధించిన 50 ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్‌ మార్కుల విధానం లేదు.

పర్సనల్‌ ఇంటర్వ్యూ
ఓఎంఆర్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఈ వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ సమాచారాన్ని అభ్యర్థికి ఎస్‌ఎంఎస్‌తోపాటు ఈమెయిల్‌ ఐడీకి తెలియజేస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు సెకండ్‌ ఏసీ రైల్వే/బస్‌ ఛార్జీలను చెల్లిస్తారు.

తుది ఎంపిక
ఓఎంఆర్‌ టెస్ట్, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా కేటగిరీల వారీగా అభ్యర్థుల తుది జాబితాను రూపొందిస్తారు. ఆఫ్‌లైన్‌ ఓఎంఆర్‌ బేస్డ్‌ టెస్ట్‌కు-80 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 20 శాతం మార్కులు కేటాయించారు. అభ్యర్థులు రెండింట్లోనూ 50 శాతం మార్కులు సాధించాలి.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 01.12.2023
  • దరఖాస్తు సవరణ తేదీలు: 3, 4 డిసెంబర్‌ 2023
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌
  • వెబ్‌సైట్‌: https://www.nationalfertilizers.com/

చ‌ద‌వండి: 8773 Bank Jobs 2023: ఎస్‌బీఐలో జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు... ఎంపిక విధానం...

Qualification GRADUATE
Last Date December 01,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories