Jobs in Andhra Pradesh: ఏపీవీవీపీ, కృష్ణా జిల్లాలో మెడికల్ పోస్టులు.. నెలకు రూ.52 వేల వరకు వేతనం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ) కృష్ణా జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: బయో మెడికల్ ఇంజినీర్లు–03,ల్యాబ్ టెక్నీషియన్లు–03,ఆడియో మెట్రీషియన్–01, డెంటల్ టెక్నీషియన్–01, ప్లంబర్–02, ఎలక్ట్రీషియన్–01, థియేటర్ అసిస్టెంట్–07, జనరల్ డ్యూటీ అటెండెంట్లు–01, పోస్ట్‌మార్టం అసిస్టెంట్లు–04, కౌన్సిలర్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత కోర్సుల సర్టిఫికేట్లతో పాటు పని అనుభవం ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(ఏపీవీవీపీ), మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 01.04.2022
వెబ్‌సైట్: https://krishna.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | April 01,2022 |
Experience | 1 year |
For more details, | Click here |