APVVP Recruitment 2022 : ఏపీవీవీపీ, కృష్ణా జిల్లాలో 117 పోస్టులు.. నెలకు రూ.52 వేల వరకు వేతనం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ) కమిషనర్ కార్యాలయం.. కృష్ణా జిల్లాలో ఒప్పంద/అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 117
పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్, థియేటర్ అసిస్టెంట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ల్యాబ్ అటెండెంట్లు, కౌన్సిలర్లు, ఆడియోమెట్రీషియన్లు, ఫిజియోథెరపిస్ట్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి/ఇంటర్మీడియట్/ఐటీఐ/డిప్లొమా /బీఏ/బీఎస్సీ/బీకామ్/బీటెక్/ఎంఎస్సీ/ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ. 15,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(ఏపీవీవీపీ), కృష్ణా, మచిలీపట్నం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 23.02.2022
వెబ్‌సైట్: https://krishna.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | February 23,2022 |
Experience | 1 year |
For more details, | Click here |