APPSC Recruitment 2022: కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్–2 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్–ఆర్డినేట్ సర్వీసులో.. కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
అర్హత: ఎస్ఎస్సీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇన్ డ్రాఫ్ట్స్‌మ్యాన్(సివిల్)ట్రేడ్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.34,580 నుంచి రూ.1,07,210 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష(పేపర్–1– 2), కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్(క్వాలిఫైయింగ్ టెస్ట్) ఆధారంగా ఎంపికచేస్తారు.
రాత పరీక్ష ఇలా: ఈ పరీక్షకు ఆన్‌లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహిస్తారు. రెండు పేపర్లుగా(150+150) 300 మార్కులకు–300 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
పేపర్–1: ఈ విభాగానికి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ –150 ప్రశ్నలకు–150 మార్కులుంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు.
పేపర్–2: ఈ పరీక్షలో ఐటీఐ(సివిల్ డ్రాఫ్ట్స్‌మ్యాన్) నుంచి ప్రశ్నలుంటాయి. గరిష్టంగా 150 మార్కులకు–150 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు.
కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్: ఆన్‌లైన్ పరీక్ష ముగిసిన తర్వాత 50 మార్కులకు కంప్యూటర్ ప్రొషియన్సీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే.
వేతనాలు: ఈ పోస్టులకు ఎంపికైన వారు పీఆర్‌సీ ప్రకారం–రూ.34,580–రూ.1,07,210 వరకు వేతనంగా పొందవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 10.11.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2022
ఫీజు చెల్లింపు చివరితేది: 04.12.2022
వెబ్‌సైట్: https://psc.ap.gov.in
చదవండి: Andhra Pradesh : 3,432 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | November 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |