Skip to main content

990 SSC Scientific Assistant IMD Notification: వాతావరణ శాఖలో నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు.. రాత పరీక్ష, సిలబస్‌ ఇలా..

990 SSC Scientific Assistant IMD Notification
 • ఐఎండీలో 990 నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ప్రకటన
 • ఎంపికైతే ప్రారంభంలోనే రూ.60వేల వరకూ వేతనం
 • నిర్దేశిత డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు

భారత వాతావరణ విభాగం(ఇండియన్‌ మెటిరియోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌-ఐఎండీ)లో గ్రూప్‌ బి నాన్‌ గెజిటెడ్, నాన్‌ మినిస్టీరియల్‌ పోస్టులైన సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 990 కొలువులను భర్తీ చేయనుంది. సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. ఈ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌సీ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ నియామక పరీక్ష-2022 పూర్తి వివరాలు.. 

 • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌(భారత వాతవరణ విభాగం) నియామక పరీక్ష-2022
 • పోస్టు: సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ గ్రూప్‌ బి(నాన్‌ గెజిటెడ్‌)
 • మొత్తం పోస్టుల సంఖ్య: 990

అర్హతలు

 • ఫిజిక్స్,మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్‌/10+2 ఉత్తీర్ణత తర్వాత సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత(డిగ్రీలో ఫిజిక్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి). లేదా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్‌/10+2 ఉత్తీర్ణత తర్వాత ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
 • వయసు: 18.10.2022 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
 • వేతనం: లెవెల్‌ 6 పే మ్యాట్రిక్స్‌ ప్రకారం వేతనం చెల్లిస్తారు. అంటే.. ఎంపికైతే ప్రారంభ మూల వేతనం రూ.35,400 అందుకోవచ్చు. డీఏ,హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అన్నీ కలుపుకొని నెలకు దాదాపు రూ.60వేల వరకూ వేతనం లభిస్తుంది.

చ‌ద‌వండి: SSC Recruitment 2022: 990 పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

ఎంపిక ప్రక్రియ

కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

రాత పరీక్ష ఇలా..

ఈ పరీక్షను రెండు పార్ట్‌లుగా కంప్యూటర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. ఒక్కో పార్ట్‌ 100 మార్కులకు ఉంటుంది. రెండు పార్ట్‌లకు కలిపి పరీక్ష సమయం 120 నిమిషాలు.

 • పార్ట్‌-1: ఈ సెక్షన్‌కు సంబంధించి నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. ఇందులో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌-25 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌-25 ప్రశ్నలు,ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌-25 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం వంద ప్రశ్నలు-వంద మార్కులకు అడుగుతారు.
 • పార్ట్‌-2: ఈ విభాగంలో ఫిజిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ /ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ల నుంచి 100 ప్రశ్నలు-వంద మార్కులకు పరీక్ష ఉంటుంది.
 • నెగిటివ్‌ మార్కులు: ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమధానానికి 0.25శాతం కోత వి«ధిస్తారు.
 • అభ్యర్థులు పార్ట్‌ 1, పార్ట్‌ 2.. రెండు విభాగాలను రాయాల్సి ఉంటుంది. పార్ట్‌ 2 పరీక్ష అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎంచుకున్న సబ్జెక్టుపై ఉంటుంది. ఉదాహరణకు ఫిజిక్స్‌ను తమ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్న వారికి పార్ట్‌ 2 పూర్తిగా ఫిజిక్స్‌పై ఉంటుంది. 

సిలబస్‌ ఇలా.. 

 • జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: ఈ విభాగంలో వెర్బల్‌-నాన్‌ వెర్బల్‌ అంశాల నుంచి ప్ర శ్నలు అడుగుతారు.  ఇందులో అనాలజీస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పేస్‌ విజువలైజేషన్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జ్‌మెంట్, డెసిషన్‌ మేకింగ్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
 • జనరల్‌ అవేర్‌నెస్‌: ఇందులో జనరల్‌ ఫిజికల్, జాగ్రఫికల్, టోపోగ్రఫికల్, ఎకానమిక్‌ అండ్‌ క్లయిమెట్‌ ఫీచర్స్‌ ఆఫ్‌ ఇండియా, కరెంట్‌ ఈవెంట్స్, రోజువారీ వార్తాంశాలు, మ్యాథమెటిక్స్‌ బేసిక్స్, కెమిస్ట్రీ,ఫిజిక్స్, భారత దేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్యం, స్వాతంత్య్ర ఉద్యమం, భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, ఆర్థిక, సామాజిక అంశాలు ఉంటాయి. 
 • క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ఈ విభాగంలో ముఖ్యంగా నెంబర్స్‌ వినియోగంపై అభ్యర్థుల సామర్థ్యాన్ని పరిక్షించే విధంగా ప్రశ్నలంటాయి. ఇందులో కంప్యూటేషనల్‌ నంబర్స్, డెసిమల్స్, పర్సంటేజెస్, రేషియో అండ్‌ ప్రపొర్షన్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, టైమ్‌ అండ్‌ వర్క్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలను అడుగుతారు.
 • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌: ఈ విభాగంలో.. ఇంగ్లిష్‌ గ్రామర్, వొకాబ్యులరీ, స్పెల్లింగ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, కాంప్రహెన్షన్, కరెక్ట్‌ అండ్‌ ఇన్‌కరెక్ట్‌ యూసేజ్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
 • పార్ట్‌-2: ఈ పరీక్షలో పోస్టులకు అనుగుణంగా సంబంధిత విభాగమైన ఫిజిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లపై ప్రశ్నపత్రం ఉంటుంది.

ముఖ్య సమాచారం

 • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
 • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 18.10.2022
 • ఎడిట్‌ ఆప్షన్‌: 25.10.2022
 • పరీక్ష తేదీ: డిసెంబర్, 2022
 • వెబ్‌సైట్‌: https://ssc.nic.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 18,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories