1,458 Jobs in CRPF: సీఆర్‌పీఎఫ్‌లో చేరే మార్గం ఇదిగో!
- ఏఎస్‌ఐ,హెడ్ కానిస్టేబుల్ పోస్ట్‌లకు సీఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్‌ల ద్వారా ఎంపిక ప్రక్రియ
- పే లెవల్-5, 4లతో ప్రారంభ వేతన శ్రేణి
- కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
సాయుధ దళాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ విభాగంలో అడుగుపెడితే జాతీయ స్థాయిలో సీఆర్‌పీఎఫ్ కార్యాలయాల్లో విధులు నిర్వహించే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలోని పోలీస్ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. అదే సన్నద్ధతతో సీఆర్‌పీఎఫ్ పోస్టులకు కూడా పోటీ పడొచ్చు.
మొత్తం 1,458 పోస్ట్‌లు
సీఆర్‌పీఎఫ్ తాజా నియామక ప్రకటనను పరిశీలిస్తే.. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఏఎస్‌ఐ), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) హోదాల్లో మొత్తం 1,458 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఇందులో 143 ఏఎస్‌ఐ, 1,315 హెడ్ కానిస్టేబుల్ పోస్ట్‌లు ఉన్నాయి.
అర్హతలు
- జనవరి 25, 2023 నాటికి ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
- వయసు: జనవరి 25, 2023 నాటికి 18-25 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ
సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ(స్టెనో), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్ట్‌లకు సంబంధించి ఎంపిక ప్రక్రియను మూడు దశల్లో నిర్వహిస్తారు. అవి.. రాత పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. దీంతోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్, డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
రాత పరీక్ష
ఎంపిక ప్రక్రియలో తొలిదశ రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో వంద ప్రశ్నలు-వంద మార్కులకు ఉంటుంది. ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్/హిందీ 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ అప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు-25 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-25 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. సెక్షన్-ఎలో అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు ఇంగ్లిష్ లేదా హిందీ లాంగ్వేజ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగతా విభాగాలకు ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమంలో హాజరు కావచ్చు.
స్కిల్ టెస్ట్
- ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే రాత పరీక్షలో మెరిట్ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
- ఏఎస్‌ఐ పోస్ట్‌ల అభ్యర్థులకు షార్ట్‌హ్యాండ్ పరీక్ష నిర్వహిస్తారు. నిమిషానికి 80 పదాలు చొప్పున పది నిమిషాలపాటు డిక్టేషన్ ఇస్తారు. ఆ డిక్టేషన్‌ను ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో 50 నిమిషాల్లో, హిందీ లాంగ్వేజ్‌లో 65 నిమిషాల్లో సవివరంగా కంప్యూటర్‌పై టైప్ చేయాల్సి ఉంటుంది.
- హెడ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయాల్సి ఉంటుంది.
- స్కిల్ టెస్ట్ కేవలం అర్హత పరీక్షగానే ఉంటుంది.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్‌లలో అర్హత సాధించిన వారికి తదుపరి దశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగుండాలి.
- పురుష అభ్యర్థులు కనీసం 165 సెం.మీ. ఎత్తు ఉండాలి. మహిళా అభ్యర్థులు 150 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి.
- ఛాతి విస్తీర్ణం కనీసం 77 సెం.మీ ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు 82 సెం.మీగా నమోదవ్వాలి. (ఈ విభాగం నుంచి మహిళా అభ్యర్థులకు మినహాయింపు కల్పించారు)
చివరగా డీఎంఈ
మూడు దశల్లోనూ విజయం సాధించిన వారికి చివరగా డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్(డీఎంఈ) పేరుతో శారీరక, ఆరోగ్య ధ్రుడత్వ పరీక్షలు నిర్వహిస్తారు. దీనికంటే ముందుగా సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. డీఎంఈలోనూ విజయం సాధించిన వారికి నియామకాలు ఖరారు చేస్తారు.
ప్రారంభ వేతనం
- ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్‌గా నియామకం ఖరారు చేసుకున్న వారికి ఏడో వేతన సవరణ ప్రకారం-పే లెవల్ 4, 5లతో ప్రారంభ వేతనం లభిస్తుంది.
- ఏఎస్‌ఐ పోస్ట్‌లకు ఎంపికైన వారికి పే లెవల్ 5తో రూ.29,200-రూ.92,300 వేతన శ్రేణి ఉంటుంది.
- హెడ్ కానిస్టేబుల్‌గా ఎంపికైన వారికి పే లెవల్ 4తో రూ.25,500-రూ.81,100 వేతన శ్రేణి ఉంటుంది.
పదోన్నతులు ఇలా
సీఆర్‌పీఎఫ్‌లో ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్ట్‌లకు ఎంపికైన వారికి పదోన్నతులు ఉంటాయి. హెడ్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఇన్‌స్పెక్టర్ స్థాయికి చేరుకోవచ్చు. అదే విధంగా ఏఎస్‌ఐ నుంచి అసిస్టెంట్ కమాండెంట్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. డిపార్ట్‌మెంట్ టెస్ట్‌లలో విజయం సా ధించిన వారికి మరింత వేగంగా పదోన్నతులు లభిస్తాయి. ప్రతి పదోన్నతికి కనీసం అయిదేళ్లు,గరిష్టంగా 18 ఏళ్ల సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్
సిలబస్ అంశాలపై పట్టుతో
జాతీయ స్థాయిలో పోటీ నెలకొనే సీఆర్‌పీఎఫ్ నియామక పరీక్షలో రాణించేందుకు.. అభ్యర్థులు ఆయా సిలబస్ అంశాలపై పట్టు సాధించాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
బేసిక్ గ్రామర్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్ స్పెల్ట్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, వన్‌వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్‌లను ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ ఆప్టిట్యూడ్
అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే ఈ విభాగంలో రాణించేందుకు.. భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలను ఔపోసన పట్టాలి. అదే విధంగా సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
జనరల్ ఇంటెలిజెన్స్
వెర్బల్, నాన్-వెర్బల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, విజువల్ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్ సిరిస్, కోడింగ్-డీకోడింగ్, నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రమ్స్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ప్యూర్ మ్యాథ్స్‌తోపాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ప్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్ అండ్ లాస్, అల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.
స్కిల్ టెస్ట్
స్కిల్ టెస్ట్‌లో రాణించేందుకు.. అభ్యర్థులు కంప్యూటర్ టైపింగ్ ప్రాక్టీస్ మెరుగుపరచుకోవాలి. టైపింగ్ టెస్ట్‌లో.. మొత్తం పదాల్లో అయిదు శాతం కంటే ఎక్కువ తప్పులుంటే.. దానికి అనుగుణంగా అభ్యర్థుల ప్రతిభను గణించే నిబంధన విధించారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 25,2023
- అడ్మిట్ కార్డ్ విడుదల: ఫిబ్రవరి 15, 2023
- ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 22 - ఫిబ్రవరి 28, 2023
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://crpfindia.com, https://crpf.nic.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | January 25,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |