CISF Recruitment 2022: సీఐఎస్‌ఎఫ్‌లో 1149 కానిస్టేబుల్ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్).. దేశవ్యాప్తంగా తాత్కాలిక ప్రాతిపదికన కానిస్టేబుల్/ఫైర్(మేల్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1149
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ–30, ఆంధ్రప్రదేశ్–79.
అర్హత: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 04.03.2022 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పే లెవల్–3 ప్రకారం నెలకి రూ.21,700 నుంచి రూ.69,100+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్‌టీ), రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: పీఈటీ/పీఎస్‌టీలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని రాతపరీక్షకు ఎంపికచేస్తారు. దీన్ని ఓఎంఆర్/కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది. దీన్ని ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. పరీక్షా సమయం 120 నిమిషాలు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.03.2022
వెబ్‌సైట్: https://www.cisfrectt.in/
చదవండి: CISF Recruitment: 249 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | March 04,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |