CISF Recruitment 2022: పదితోనే సీఐఎస్‌ఎఫ్ 787 కానిస్టేబుల్ పోస్టులు.. రాత పరీక్ష ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 787(పురుషులు-641, మహిళలు-69, ఎక్స్‌సర్వీస్‌మెన్-77)
పోస్టులు/ట్రేడ్‌ల వారీగా ఖాళీలు
- కానిస్టేబుల్/కుక్-304, కానిస్టేబుల్/ క్లోబర్- 06, కానిస్టేబుల్/టైలర్-27, కానిస్టేబుల్/బార్బర్-102, కానిస్టేబుల్/వాషర్‌మ్యాన్-118, కానిస్టేబుల్/స్వీపర్-199, కానిస్టేబుల్/పెయింటర్-01, కానిస్టేబుల్/ప్లంబర్-04, కానిస్టేబుల్ /మాలి-03, కానిస్టేబుల్ /వెల్డర్-03.
- బ్యాక్‌లాగ్ పోస్టులు: కానిస్టేబుల్ /కోబ్లర్-01, కానిస్టేబుల్ /బార్బర్-07.
అర్హతలు
- పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
- వయసు: 01.08.2022 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు
- ఎత్తు: పురుషులు 170 సెం.మీ, మహిళా అభ్యర్థులు 157 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతీ ఊపిరి పీల్చి,వదిలినప్పుడు 80-85 మధ్య ఉండాలి.
- రన్నింగ్ టెస్ట్: పురుష అభ్యర్థులు 1.6 కి.మీ దూరాన్ని 6 నిమిషాల 30 సెకన్లలో పరుగెత్తాలి. మహిళా అభ్యర్థులు 800 దూరాన్ని 4 నిముషాల్లో పరుగెత్తాలి.
- వేతనాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ప్రతి నెల రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనంగా పొందుతారు. అంతేకాకుండా ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
ఎంపిక ప్రక్రియ
ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్(పీఎస్‌టీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, ఓఎంఆర్ బేస్డ్/కంప్యూటర్ బేస్డ్(సీబీటీ), మెడికల్ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష ఇలా
పీఎస్‌టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. 100 ప్రశ్నలకు-100 మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్,ఎనలిటికల్ ఆప్టిట్యూడ్, హిందీ/ఇంగ్లిష్‌లో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 20.12.2022
- వెబ్‌సైట్: https://cisfrectt.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |