NIELIT Recruitment: నీలిట్, న్యూఢిల్లీలో సైంటిస్ట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్)... సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: సైంటిస్ట్ సి–28, సైంటిస్ట్ డి–05.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంఫిల్ ఉత్తీర్ణులవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ/విద్యా సంస్థల్లో/పరిశ్రమల్లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో అనుభవం ఉండాలి.
వయసు: సైంటిస్ట్ సి పోస్టులకు 35ఏళ్లు, సైంటిస్ట్ డి పోస్టులకు 40ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: సైంటిస్ట్ సి పోస్టులకు నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700, సైంటిస్ట్ డి పోస్టులకు నెలకు రూ.78,800 నుంచి రూ.2,09,200 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, అకడమిక్ రికార్డుల ఎవాల్యూయేషన్, పర్సనల్ ఇంటరాక్షన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.12.2021
వెబ్‌సైట్: https://www.nielit.gov.in
చదవండి: ASRB Recruitment: ఏఎస్‌ఆర్‌బీ, న్యూఢిల్లీలో రీసెర్చ్ మేనేజ్‌మెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | GRADUATE |
Last Date | December 07,2021 |
Experience | 5 year |
For more details, | Click here |