AIIMS Recruitment: ఎయిమ్స్ పాట్నాలో సైంటిస్ట్ పోస్టులు.. అర్హతలు ఇవే..
పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)కు చెందిన రీజనల్ వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీ, మైక్రోబయాలజీ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌లు బీ,సీ(మెడికల్, నాన్ మెడికల్)–04, రీసెర్చ్ అసిస్టెంట్–02, ల్యాబ్ టెక్నీషియన్–04, డేటాఎంట్రీ ఆపరేటర్–02, మల్టీ టాస్కింగ్‌స్టాఫ్–06.
అర్హత: పోస్టులను అనుసరించి పదోతరగతి, ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్/బీడీఎస్, పీజీ డిగ్రీ(ఎండీ/డీఎన్‌బీ) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు అవసరమైన నైపుణ్యాలు ఉండాలి.
వయసు: పోస్టులను అనుసరించి 30–45 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టులను అనుసరించి నెలకు రూ.15800 నుంచి రూ.67000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 22.11.2021
వెబ్‌సైట్: https://www.aiimspatna.org
చదవండి: ASRB Recruitment: ఏఎస్‌ఆర్‌బీ, న్యూఢిల్లీలో రీసెర్చ్ మేనేజ్‌మెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | 10TH |
Last Date | November 22,2021 |
Experience | 1 year |
For more details, | Click here |