Skip to main content

DRDO Recruitment: డీఆర్‌డీవో-ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

DRDO

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న డీఆర్‌డీవో–ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌(ఐటీఆర్‌)..వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరాఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 116
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–50, డిప్లొమా(టెక్నీషియన్‌) అప్రెంటిస్‌లు–40, ట్రేడ్‌ అప్రెంటిస్‌లు–26.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ తదితరాలు. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీబీఏ, బీకాం, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.

డిప్లొమా(టెక్నీషియన్‌) అప్రెంటిస్‌లు: 
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్,సివిల్,సినిమాటోగ్రఫీ తదితరాలు. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

ట్రేడ్‌ అప్రెంటిస్‌లు: 
ట్రేడులు: కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, మెకానిక్‌ పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

2019, 2020, 2021లో అర్హత కోర్సు ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మార్కులు/ఆన్‌లైన్‌ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 01.11.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.11.2021

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

చ‌ద‌వండి: DRDO Recruitment: డీఆర్‌డీవో–ఏఎస్‌ఎల్, హైదరాబాద్‌లో 40 పోస్టులు... పూర్తి వివరాలు ఇవే

Qualification GRADUATE
Last Date November 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories