Engineering Jobs: హెచ్‌పీసీఎల్‌లో 294 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
మహారత్న సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్).. పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్, పెట్రోకెమికల్,ఆర్ అండ్ డీ, ఇతర విభాగాల్లో మొత్తం 294 ఖాళీలను భర్తీ చేయనుంది. బీటెక్ అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. ఆయా పోస్టుల వివరాలు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు...
విభాగాల వారీగా ఖాళీలు
మెకానికల్ ఇంజనీర్–103, ఎలక్ట్రికల్ ఇంజనీర్–42, ఇన్‌స్ట్రుమెంట్æఇంజనీర్–30, సివిల్ ఇంజనీర్–25, కెమికల్ ఇంజనీర్–07, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫీసర్–05,సేఫ్టి ఆఫీసర్(యూపీ)–06, తమిళనాడు–01,కేరళ–05,గోవా–01,ఫైర్ అండ్ సెఫ్టీ ఆఫీసర్–02, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్–27, బ్లెండింగ్ ఆఫీసర్–05, చార్టర్డ్ అకౌంటెంట్–15, హెచ్‌ఆర్–08, వెల్ఫేర్ ఆఫీసర్–విశాఖ రిఫైనరీ–01, ముంబై రిఫైనరీ–01, లా ఆఫీసర్–05, లా ఆఫీసర్ హెచ్‌ఆర్–2, మేనేజర్/సీనియర్ మేనేజర్–ఎలక్ట్రికల్ విభాగాల్లో 3 పోస్టులున్నాయి.
చదవండి: NFL Recruitment 2022: ఎన్‌ఎఫ్‌ఎల్, నోయిడాలో వివిధ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
అర్హతలు
విభాగాలను అనుసరించి ఆయా పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, సీఏ, ఎంబీఏ, హెచ్‌ఆర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ లా చదివిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు
25–37ఏళ్ల లోపు వయసు వారు సంబంధిత విభాగంలోని పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి గ్రూప్ టాస్క్ ఉంటుంది. ఇందులోనూ ప్రతిభ చూపిన వారిని ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. లా ఆఫీసర్ ఉద్యోగాలకు మూట్ కోర్ట్ పరీక్ష ఉంటుంది. మొత్తం అర్హత పరీక్షల్లో రాత పరీక్షకు 85శాతం, గ్రూప్ టాస్క్‌కు 5శాతం, ఇంటర్వ్యూకి 10శాతం వెయిటేజీని ఇస్తారు.
చదవండి: FACT Recruitment 2022: ఫ్యాక్ట్‌లో 137 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
రాత పరీక్ష ఇలా
- రాత పరీక్ష ఆన్‌లైన్(సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. మొదటిది జనరల్ ఆప్టిట్యూడ్, రెండోది టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్. రెండు పేపర్లకు కలిపి రెండున్నర గంటల పరీక్ష సమయం కేటాయిస్తారు. నెగిటివ్ మార్కులులేవు.
- జనరల్ ఆప్టిట్యూడ్: ఈ పేపర్‌లో ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్(లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటెషన్) సంబంధించిన అంశాలపై ప్రశ్నలను ఇస్తారు.
- రెండో విభాగానికి సంబంధించి అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబంధించిన విభాగం నుంచి సబ్జెక్ట్ పరమైన ప్రశ్నలను అడుగుతారు.
వేతనాలు
- ఈ2, గ్రేడ్–సి, గ్రేడ్–డి మూడు గ్రేడులుగా ఈ ఉద్యోగాలను విభజించారు. ఈ2 గ్రేడ్‌లోని ఉద్యోగులు రూ.50,000 నుంచి రూ.1.60,000 వరకు వేతనంగా పొందుతారు. గ్రేడ్–సీ ఉద్యోగులకు రూ.80,000 నుంచి రూ.2,20,000 వరకు వేతనంగా లభిస్తుంది. అలాగే గ్రేడ్–డీలోని ఉద్యోగులకు రూ.90,000 నుంచి రూ.2,40,000 వరకూ వేతనంగా చెల్లిస్తారు. వీటికి అదనంగా అలవెన్సులతోపాటు ఇతర ప్రయోజనాలను అందిస్తారు.
- హెచ్‌పీసీఎల్.. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తుంది. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పనిచేయాల్సి ఉంటుంది. మొదటి ఏడాది ప్రొబేషన్ కాలం ఉంటుంది. ప్రొబేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన వారికి కన్ఫర్మేషన్ ఇస్తారు.
సన్నద్ధత ఇలా
- అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన సిలబస్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అలాగే పరీక్ష సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక టైం టేబుల్ ప్రిపేర్‌చేసుకోవాలి. –రాత పరీక్షలో సాధించే మార్కులకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు మంచి మార్కుల సాధన కోసం కృషి చేయాలి.
- పరీక్షకు సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరీశీలించాలి. దీనివల్ల ప్రశ్నల క్లిష్టత స్థాయి, అడిగే విధానంపై అవగాహన ఏర్పడుతుంది.
- సంబంధిత సబ్జెక్ట్‌లకు సంబంధించిన ప్రాక్టీస్ టెస్టులను ఎక్కువగా సాధన చేయాలి.
- సరైన, వ్యూహం, ప్రణాళిక బద్దమైన ప్రిపరేషన్‌తో మెరుగైన మార్కులను సాధించవచ్చు.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధనం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 22, 2022
- వెబ్‌సైట్: https://www.hindustanpetroleum.com/
చదవండి: ONGC Recruitment 2022: ఓపీఏఎల్, వడోదరలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 22,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |