38926 Jobs In Postal Department: పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ కొలువు..
పదో తరగతిలో మెరిట్ మార్కులు సాధించారా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారా.. అయితే ఈ సదావకాశం మీకోసమే! పదోతరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ కొలువు సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది భారత పోస్టల్ విభాగం. రాత పరీక్ష, ఇంటర్వ్యూ వంటివి లేకుండానే నియామక ప్రక్రియను నిర్వహిస్తోంది. తాజాగా 38వేలకు పైగా గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో.. పోస్టల్ విభాగంలో కొలువుల గురించి తెలుసుకుందాం...
పోస్టులు: గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 38926
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ–1226, ఆంధ్రప్రదేశ్–1716
విభాగాల వారీగా..
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం)
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం)
- డాక్ సేవక్
- అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే.. ఏపీ, తెలంగాణకు చెందిన వారు పదోతరగతి స్థాయి వరకు తెలుగు సబ్జెక్ట్ చదవడం తప్పనిసరి. అలాగే వీరికి సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
- వయసు: 18–40ఏళ్ల మధ్య వయసు వారై ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంది.
జీత భత్యాలు
ఎంపికైన పోస్టు, సేవలను అనుసరించి టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్సు (టీఆర్‌సీఏ) ప్రకారం–జీతభత్యాలు చెల్లిస్తారు. బీపీఎం పోస్టుకు 4 గంటల టీఆర్‌సీఏ స్లాబ్ కింద నెలకు రూ.12 వేలు, ఏబీపీఎం/డాక్ సేవక్ పోస్టులకు 4 గంటల టీఆర్‌సీఏ స్లాబ్ కింద నెలకు రూ.10 వేలు చెల్లిస్తారు.
విధులు ఇలా
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా ఎంపికైన వారు సంబంధిత బ్రాంచ్ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్ విధులతోపాటు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వ్యవహారాలు చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్ లావాదేవీలు, రోజువారీ కార్యకలాపాలు, ఉత్తరాల పంపిణీ సరిగా జరిగేలా చూసుకోవాలి. పోస్టల్‌కు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలు, టీమ్ లీడర్‌గా సంబంధిత బ్రాంచ్‌ని నడిపించాలి.
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం)గా ఎంపికైన వారు స్టాంపులు/స్టేషనరీ అమ్మకం, ఉత్తరాల పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్ పోస్టు పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్ వ్యవహారాలు, బ్రాంచ్ పోస్టు మాస్టర్ చెప్పిన పనులను చేయాలి.
- డాక్ సేవక్‌గా ఎంపికైన వార ఉత్తరాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టాంపులు/స్టేషనరీ అమ్మకాలు చేయాలి. దాంతోపాటు బీపీఎం, ఏబీపీఎం చెప్పిన పనులు చేయాల్సి ఉంటుంది. రైల్వే మెయిల్ సర్వీస్, పోస్టల్ పేమెంట్ బ్యాంకు పనులు చూసుకోవాలి.
చదవండి: Postal Department: పదో తరగతి అర్హతతో 38926 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఎంపిక ఇలా
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా నియామకాలు చేపడుతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచ్‌లు, పని సమయాలు, ఏ హోదాలు ఖాళీలు ఉన్నాయో అనే విషయాలను క్షుణ్నంగా పరిశీలించి.. గరిష్ట ఆప్షన్‌లను ఎంపిక చేసుకోవాలి. సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ప్రకారం అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.
- దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు,ట్రాన్స్‌జెండర్‌లకు ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.మిగతా అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరి తేదీ: 05.06.2022
- వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Qualification | 10TH |
Last Date | June 05,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |