AP University Jobs: 3,220 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ప్రిపరేషన్ ఇలా

- ఏపీ యూనివర్సిటీల్లో భారీగా అధ్యాపక ఉద్యోగాలు
- మొత్తం 3,220 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు
- స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక
మొత్తం 3,220 పోస్ట్‌లు
రాష్ట్రంలోని 18 ప్రభుత్వ యూనివర్సిటీల్లో మొత్తం 3,220 అధ్యాపక పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రొఫెసర్ పోస్టులు 418, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 801, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2,001 ఉన్నాయి. అధ్యాపక వృత్తిలో అడుగుపెట్టేందుకు అవసరమైన పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, యూజీసీ నెట్, యూజీసీ సీఎస్‌ఐఆర్ నెట్, స్లెట్/సెట్ వంటి అర్హతలు సాధించిన అభ్యర్థులకు తాజా నోటిఫికేషన్ సువర్ణావకాశమని చెప్పొచ్చు.
అర్హతలు
- అసిస్టెంట్ ప్రొఫెసర్: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీ /ఎంఫిల్/పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు నెట్ లేదా ఏపీ స్లెట్/సెట్ ఉత్తీర్ణత ఉండాలి.
- అసోసియేట్ ప్రొఫెసర్: సంబంధిత సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పీజీలో 55 శాతం మార్కులు సాధించాలి. అకడమిక్/రీసెర్చ్ స్థాయిలో యూనివర్సిటీ /కళాశాల/ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్/ఇండస్ట్రీలో 8ఏళ్ల అనుభవం తప్పనిసరి. నిర్దేశిత జర్నల్స్‌లో కనీసం ఏడు పబ్లికేషన్స్ ప్రచురితమై ఉండాలి.
- ప్రొఫెసర్: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు 10 రీసెర్చ్ పబ్లికేషన్స్ ప్రచురితమై ఉండాలి. యూనివర్సిటీ/కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్/అసోసియేట్ ప్రొఫెసర్/ప్రొఫెసర్ హోదాలో పదేళ్ల టీచింగ్ అనుభవం లేదా యూనివర్సిటీ/జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్స్‌లో పదేళ్ల రీసెర్చ్ అనుభవం ఉండాలి.
- రిజర్వ్‌డ్ కేటగిరీ వర్గాలకు అర్హత మార్కుల్లో అయిదు శాతం చొప్పున సడలింపు ఉంటుంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు స్క్రీనింగ్ టెస్ట్
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌ల భర్తీకి ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనికోసం అభ్యర్థులు ఒకే దరఖాస్తుతో అన్ని యూనివర్సిటీల్లోని పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా తమ అర్హతలకు అనుగుణంగా సరితూగే అన్ని పేపర్లకు పోటీ పడొచ్చు. ఇలా 18 యూనివర్సిటీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌లకు ఒకే సమయంలో సన్నద్ధత పొందొచ్చు.
చదవండి: Teacher Job Vacancies : 10 లక్షలకుపైగా టీచర్ల పోస్టులు ఖాళీలు.. ఈ కొరతను నివారించాలంటే..
స్క్రీనింగ్ టెస్ట్.. 450 మార్కులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌ల భర్తీ కోసం తొలిదశలో.. కంప్యూటర్ బేస్డ్ విధానంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సబ్జెక్ట్‌పై 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్ష జరుగుతుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. పరీక్షకు కేటాయించిన సమయం మూడు గంటలు. నెగెటివ్ మార్కింగ్ నిబంధన అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.
తదుపరి దశ పర్సనల్ ఇంటర్వ్యూ
- స్క్రీనింగ్ టెస్ట్‌లో నిర్దేశిత మార్కులు పొందిన వారికి తదుపరి దశలో 100 మార్కులకు 45 నిమిషాల వ్యవధిలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రిజర్వేషన్ కేటగిరీని అనుసరించి ఒక్కో పోస్ట్‌కు నలుగురిని చొప్పున పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు జరిగే ఇంటర్వ్యూను రెండు విభాగాలుగా నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూలో విభాగం–1కు 40 మార్కులు; విభాగం–2కు 60 మార్కులు ఉంటాయి. విభాగం–1లో లెక్చర్ డిమాన్‌స్ట్రేషన్‌కు 25మార్కులు; ఇంటర్ డిసిప్లినరీ అవేర్‌నెస్, క్రిటికల్ థింకింగ్, పర్సనాలిటీ తదితర అంశాలకు 15 మార్కులు కేటాయిస్తారు.
- విభాగం–2లో బోధన పద్ధతులు, పరిశోధన దృక్పథంపై 60 మార్కులకు మౌఖిక పరీక్ష ఉంటుంది. ఇందులో డొమైన్ నాలెడ్జ్, టెక్నాలజీ ఆధారిత లెర్నింగ్‌కు 35 మార్కులు; పరిశోధన సామర్థ్యం, భవిష్యత్తు ప్రణాళికలు అంశానికి 25 మార్కులు కేటాయిస్తారు.
ఒప్పంద ఫ్యాకల్టీకి వెయిటేజీ
పర్సనల్ ఇంటర్వ్యూ తర్వాత తుది విజేతలను నిర్ణయించే క్రమంలో ఇప్పటికే ఉన్నత విద్యా సంస్థల్లో కాంట్రాక్ట్ విధానంలో ఫ్యాకల్టీగా పని చేస్తున్న వారికి వెయిటేజీ కల్పిస్తారు. వారు పని చేసిన కాలాన్ని అనుసరించి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా పది మార్కులను ఒప్పంద అధ్యాపకులకు కేటాయిస్తారు.
అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్ట్‌లు.. భర్తీ ఇలా
- అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్‌ల భర్తీకి యూనివర్సిటీల స్థాయిలో ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆయా పోస్ట్‌లకు వచ్చిన దరఖాస్తులు, అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని, రిజర్వేషన్లను అనుసరించి ఒక్కో పోస్ట్‌కు నలుగురి చొప్పున ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. n అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేసే క్రమంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటికి నిర్దిష్ట వెయిటేజీ పాయింట్లు కేటాయిస్తారు. అకడమిక్ స్కోర్‌కు 80 పాయింట్లు, రీసెర్చ్ పబ్లికేషన్స్‌కు 10 పాయింట్లు, టీచింగ్/పోస్ట్ డాక్టోరల్ అనుభవానికి 10 పాయింట్లు చొప్పున కేటాయిస్తారు. అకడమిక్ స్కోర్‌లో భాగంగా గ్రాడ్యుయేషన్ నుంచి పీహెచ్‌డీ వరకు పొందిన ఉత్తీర్ణత శాతాన్ని, అదే విధంగా నెట్–జేఆర్‌ఎఫ్, నెట్, స్లెట్/సెట్, అకడమిక్ అవార్డ్‌లను పరిగణనలోకి తీసుకుంటారు.
తుది ఎంపికలోనూ వెయిటేజీ విధానం
ఆయా పోస్ట్‌లకు నియామకాలను ఖరారు చేసే క్రమంలో తుది జాబితా రూపకల్పనలోనూ వెయిటేజీ విధానం అనుసరిస్తారు.అకడమిక్/రీసెర్చ్ స్కోర్‌కు, ఇంటర్వ్యూ స్కోర్‌కు 50 శాతం చొప్పున వెయిటేజీ కల్పిస్తారు. దీనికి అనుగుణంగా అభ్యర్థులు పొందిన మార్కులను క్రోడీకరించి తుది ఎంపిక చేస్తారు.
భారీగా వేతనాలు
- అసిస్టెంట్ ప్రొఫెసర్: పే లెవల్–10: వేతన శ్రేణి రూ.57,700–రూ.1,82,400
- అసోసియేట్ ప్రొఫెసర్: పే లెవల్–13ఎ: వేతన శ్రేణి రూ.1,31,400–రూ.2,17, 100.
- ప్రొఫెసర్: పే లెవల్–14ఎ: వేతన శ్రేణి: రూ.1,44,200–రూ.2,18,200.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 20, 2023.
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రింట్ ఔట్‌ను పోస్ట్ ద్వారా పంపేందుకు చివరి తేదీ: నవంబర్ 27,2023.
- అసిస్టెంట్ ప్రొపెఫసర్ స్క్రీనింగ్ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: నవంబర్ 30,2023.
- అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 7,2023.
- స్క్రీనింగ్ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా వెల్లడి: డిసెంబర్ 8, 2023.
- అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్ట్‌లకు దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 20, 2023.
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రింట్ ఔట్స్‌ను పోస్ట్ ద్వారా పంపేందుకు చివరి తేదీ: నవంబర్ 27, 2023.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://recruitments.universities.ap.gov.in/Masters/Home.aspx
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | November 20,2023 |
Experience | 5-10 year |
For more details, | Click here |