CTET 2024 Notification: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) జనవరి-2024 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం ఇలా..
Sakshi Education
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) జనవరి-2024 ఏడాదికి సంబంధించి సీటెట్ నోటిఫికేషన్ విడుదలచేసింది.
అర్హత
- పేపర్-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా(డీఈఎల్‌ఈడీ)/డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
- పేపర్-2: 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్(బీఈడీ)/బీఈడీ(ప్రత్యేక విద్య) లేదా సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ)/బీఎస్సీఈడీ/బీఏఈడీ/బీఎస్సీఈyీ ఉత్తీర్ణులై ఉండాలి.
CTET 2024 Notification: పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్..
పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోరు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
చదవండి: టెట్ బిట్ బ్యాంక్
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.12.2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేది: 21.01.2024
వెబ్‌సైట్: https://ctet.nic.in/
చదవండి: టెట్ ప్రిపరేషన్ గైడెన్స్
Published date : 29 Nov 2023 03:39PM