Skip to main content

ముంబై పోర్ట్‌ ట్రస్ట్‌లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీలు..అర్హతలు ఇవే..

ముంబైలోని ముంబై పోర్ట్‌ ట్రస్ట్‌ 2020–21 సంవత్సరానికిగాను వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 11
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–05, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌–06.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌:
విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉండాలి.
స్టయిపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌:
విభాగాలు:
మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉండాలి.
స్టయిపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంజనీరింగ్‌ డిప్లొమా/ఇంజనీరింగ్‌ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ఏటీసీ, బందర్‌భవన్, థర్డ్‌ ఫ్లోర్, ఎన్‌.వీ.నక్వా మార్గ్, మజగాన్‌(ఈస్ట్‌), ముంబై–400010 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021

వెబ్‌సైట్‌: www.mumbaiport.gov.in
Last Date August 27,2021
Experience Fresher job

Photo Stories